బ్రేకింగ్.. ఎయిర్పోర్టులో 40 బుల్లెట్స్ ఉన్న బ్యాగ్ తో పట్టుబడిన సినీ నటుడు.. షాక్ లో జనం..?!

చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఇటీవల షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సౌత్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కారణాస్ హ్యాండ్ బ్యాగ్ లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గుర్తించారు. ఆదివారం చెన్నై ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు బ్యాగులను చెక్ చేస్తున్న క్రమంలో.. భద్రత సిబ్బంది నటుడు కారణాస్ బ్యాక్ ను చెక్ చేశారు. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ అలారం మోగడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వెంటనే బ్యాగ్ ను చెక్ చేయగా 40 లైవ్ రౌండ్ ల కోసం రెండు పెట్టల్లో ఒక్కొక్కటి 20 రౌండ్లు ఉన్నాయి. అవన్నీ 32 ఎంఎం పిజిటల్ కాలిబర్ కాట్రేడ్జిలు అని తెలిసింది.

Chennai airport resumes flight ops a day after Cyclone Michaung disruption  | India News - Business Standard

దీంతో వెంటనే భద్రతాధికారులు బుల్లెట్స్ నా స్వాధీనం చేసుకుని ఆ సంఘటనపై విచారణ మొద‌లు పెట్టారు. దీనిపై నటుడు కారణాస్‌ మాట్లాడుతూ నాకు లైసెన్స్ తుపాకీ ఉందని.. అందులో వాడే బుల్లేట్సే ఇవి అంటూ వివ‌రించాడు. విమానంలో బుల్లెట్లు తీసుకెళ్లకూడదనే నిబంధన ఉందని నాకు తెలుసు.. కానీ హడావిడిలో మర్చిపోయాను.. బాగ్లో బుల్లెట్ బాక్స్‌ల‌ను గమనించలేదంటూ చెప్పుకొచ్చాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధన ప్రకారం తుపాకీని ఆయన స్వగ్రామం డిండిగ‌ల్‌లో పోలీస్ స్టేషన్ లో అప్పగించానని పేర్కొన్నాడు.

Shocking: Actor and MLA Karunas tests positive for Corona! - Tamil News -  IndiaGlitz.com

అయితే హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఈ బుల్లెట్ల సంగతి గుర్తు లేదంటే చెప్పుకొచ్చాడు. కారణాస్ తన గ‌న్‌ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన‌ట్లు వివ‌రించాడు. దానికి సంబంధించిన పత్రాలను అధికారులకు చూపించాడు. దీంతో సెక్యూరిటీ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో బుల్లెట్లను తీసుకెళ్లవద్దని వివరించి.. అతని బ్యాగ్ ను తిరిగి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారింది.