ఇన్నాళ్లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వార్త ఫైనల్లీ నిజమైంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో పూజా హెగ్డే నటించబోతుంది . దీనికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ కూడా వచ్చింది. మనకు తెలిసిందే.. ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నాడో. ప్రసెంట్ కంగువా సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు . ఈ సినిమాను డైరెక్టర్ శివ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.
స్టూడియో గ్రీన్ అండ్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజా ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు . కాగా ఈ మూవీ రిలీజ్ కంటే ముందే కార్తీక్ సుబ్బరాజుతో ఒక మూవీ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు సూర్య . దీనిని 2డి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. భోజు జార్జ్ ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఉండడం సినిమాకే హైలెట్ గా మారింది . ఈ సినిమా సూర్య కెరియర్లో 44వ సినిమాగా రాబోతుంది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే అంటూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం. మేకర్స్ ఆమె కి వెల్కమ్ చెప్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు . చీర కట్టులో చక్కగా అద్దిరిపోయే విధంగా కనిపించింది పూజ హెగ్డే. ఈ పిక్స్ చూస్తూ ఉంటే బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ అనేలా అనిపిస్తుంది . దీనితో సోషల్ మీడియాలో అమ్మడు పోస్టర్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ పూజ కెరియర్ ఎలా సెట్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే..!!