మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్న నాని… స్టార్ హీరోలు సైతం అలాంటి త్యాగం చేయరు…!!

నాచురల్ స్టార్ నాని మనందరికీ సుపరిచితమే. ఈయన నటించిన తాజా మూవీ ” హాయ్ నాన్న ” ఇటీవలే (డిసెంబర్ 7 ) రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాతో శౌర్యవ్ అనే దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాలో.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూస్ అన్ని కూడా సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

అలా అని తీసిపారేసే విధంగా కూడా లేవు. ఇక ఈ సినిమాకి రూ. 63 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి రూ. 68 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా ద్వారా నిర్మాతకి ఐదు కోట్ల డబుల్ ప్రాఫిట్ దక్కింది. అయితే నాని ఇంకా తన పూర్తి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇప్పుడు నాని రెమ్యూనరేషన్ రేంజ్ రూ. 25 కోట్లు. హాయ్ నాన్న మూవీ కి అడ్వాన్స్ రూపంలో రూ.6 కోట్లు అందుకున్నాడట నాని.

ఇక ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది. దీంతో లాభాలు వస్తే నాని.. మిగిలిన పారితోషికం తీసుకుంటాను అని చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పుడు థియేట్రికల్ గా నిర్మాతలకి లాభాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అయినప్పటికీ నాని ఇంకా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఇలా పారిదోషకం ఫుల్ గా తీసుకోకుండా.. సినిమాని ఇంకా ప్రమోట్ చేయడం అంటే మాటలు కాదు. ఇక ఈ విషయంలో నాని ది చాలా గొప్ప మనసు అనే చెప్పాలి. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు… నానిని ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు.