కోర్టులో అన్న అంటూ ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు… క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే..!

నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్ళిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్‌తో ఓ ప్రియుడికి దిమ్మతిరిగింది. ఆ షాక్ లోనే జడ్జ్ ఛాంబర్ లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు (31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేశాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో తను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట.

అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్ లో ఆరోపించాడు. దీంతో సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంటే అప్పటిదాకా విష్ణు లేనిదే తను ఉండలేదంటూ పోలీసులతో.. మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చేసింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని.. తను తన కుటుంబ సభ్యులతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరి ఎటువంటి ఫీలింగ్ లేదని అతను బాగుండాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది.

దీంతో డివిజన్ బెంచ్ యువతని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. ఆ ఊహించని పరిణామంతో బోరున వెల్లపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్‌కు వెళ్ళాడు. తన మణికట్టు కోసుకొని ఏడ్వసాగాడు‌. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్‌లో ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే సదరు యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది.