బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫ్రేమ్ తెచ్చుకుంది తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య. తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బస్తీ యువతి, కాలేజీ స్టూడెంట్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇంతకుముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవి చైతన్య.. తొలిసారి బేబీ సినిమాతో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తొలి మూవీతోనే హిట్ అందుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య నటించింది.
అయితే బేబి సినిమా హిట్ తో వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను తీసుకున్నారు. ఇక ఆశిష్ హీరోగా అరుదణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కూడా వైష్ణవి చైతన్య నటిస్తోంది.
బేబీ సినిమా హిట్ తో వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అచ్చమైన తెలుగుదనంతో తన నటనతో తిరుగులేదని చాటి చెప్పింది వైష్ణవి. ఇప్పుడు కొత్త అవకాశాల విషయంలో కూడా స్టార్ హీరోయిన్లకు పోటీగా నటిస్తోంది. బేబీ సినిమా సక్సెస్ సాధించినందుకు హీరో అల్లు అర్జున్ కూడా చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. అలాగే వైష్ణవి చైతన్యపై కూడా ప్రశంసలు కురిపించాడు. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, వైష్ణవి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కితాబిచ్చారు. వైష్ణవి నటనను కూడా అల్లు అర్జున్ పొగిడాడు.