కన్నడ నటి కాంగ్రెస్ నాయకురాలు దివ్య స్పందన గుండెపోటుతో మరణించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు రావడం తో ఈమె అభిమానులు సైతం ఆందోళనలకు గురయ్యారు.. సోషల్ మీడియాలో ఆమె చనిపోయినట్టు పోస్టులు రావడంతో కొంతమంది ఆమె మరణానికి సంతాపాన్ని సైతం తెలియజేస్తున్నారు.. దివ్య స్పందనకు ప్రస్తుతం 40 ఏళ్లు.. కొందరు వ్యక్తులు ట్విట్టర్లో ఈమె గుండెపోటుతో మరణించింది అంటు పోస్ట్లు షేర్ చేయడం జరిగింది.
ఈమె తమిళ్ తెలుగు సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ వార్తలు నిజం కాలేదని తెలియడంతో దివ్య స్పందన అభిమానులు కాస్త ఊపిరిపించుకున్నారు.. జర్నలిస్ట్ చిత్ర సుబ్రహ్మణ్యం ట్విట్టర్ వేదికగా సకాలంలో స్పందించడం జరిగింది నేను ఇప్పుడు దివ్య స్పందనతో మాట్లాడడం జరిగింది ఆమె క్షేమంగా ఉన్నది అంటూ తెలియజేశారు. దివ్య స్పందన హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. తమిళంలో స్టార్ హీరోల సర్కన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కత్తూ రమ్య పేరుతో పాపులర్ అయింది.
తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్య సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది. దీంతో కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాలలో హీరోయిన్గా నటించింది.. 2013 ఉప ఎన్నికలలో కర్ణాటకలోని మాధ్య నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది అయితే ఆ తర్వాత ఏడాదిలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆమె ఓటమిపాలయ్యింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వింగ్ లో ఆమె కీలక బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ఆజ్ఞలేత రాహుల్ గాంధీ టీంలో ముఖ్యురాలిగా గుర్తింపు పొందింది.
It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana
— Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023