మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు చెర్రీ. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారట.
రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని బయోపిక్‌కి రామ్ చరణ్ హీరోగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు విరాట్ కోహ్లీ బయోపిక్ అంటే దాదాపు క్రికెట్ ప్రియులందరికీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందులో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇంతకీ ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో మూవీ టీం ప్రకటిస్తే కాని తెలియదు.