విజ‌య్ నీ వ‌ల్ల రు.8 కోట్లు నాకు బొక్కా… ఈ డ‌బ్బు ఎవ‌రిస్తారంటూ నిర్మాత ట్వీట్ క‌ల‌క‌లం..!

ఖుషి సినిమా హిట్ అవడంతో విజయ్ దేవరకొండ ఆనందానికి హద్దులు లేవు. ఈ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఖుషి సినిమా సంపాదనలోంచి రూ. 1 కోటిని తన అభిమానులకు ఇస్తున్నానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రకటించాడు. విజయ్ ది గొప్ప మనసు అంటూ నెటిజన్స్ ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా ‘ వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు మాకు కూడా సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ డియర్ విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీలో రూ. 8 కోట్లు నష్టపోయాం. ఇంతవరకు దానిపై ఎవరు స్పందించలేదు.

మీ గొప్ప మనసుతో రూ. కోటిని పలు కుటుంబాలకు సాయం చేస్తున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబ సభ్యులకు కూడా సాయం చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాం ” అని ట్విట్‌లో పేర్కొంది. మరి ఈ ట్వీట్ పై విజయ్ స్పందిస్తాడో? లేదో చూడాలి.