ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న మాస్ కా దాస్.. ఆహాలో స్ట్రీమింగ్..

యంగ్ హీరో విశ్వక్‌సేన్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తు బిజిగా ఉన్నాడు. విశ్వక్ ఇటీవల దాస్ కా ధంకీ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కెరీర్ పరంగా మంచి బిజీగా ఉన్న విశ్వక్ సినిమాల్లోనే కాక యాంకర్ గా కూడా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు.

కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం వచ్చిన ఓటీపీ ఆహా ఫస్ట్ నుంచి కొత్త కొత్త తాట్స్ తో డిఫరెంట్ షోలు, సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక విశ్వ‌క్ యాంకర్‌గా ఆహా ఓటీటీలో మరో సరికొత్త షో రాబోతుందట. ఫ్యామిలీ ధమాకా అనే కొత్త‌షోని ఆహా అనౌన్స్ చేసింది. కొన్ని ఫ్యామిలీలతో ఒక గేమ్ షో లాంటిది ప్లాన్ చేశారు.

మాస్ కా దాస్ విశ్వ‌క్‌ ఆ ఫ్యామిలీతో ఆడించే గేమ్లను చూడండి అంటూ ఆహా ఈ షో కి సంబంధించిన పోస్టర్‌ని ఇటీవ‌ల‌ ప్రకటించింది. ఇప్పటికే ఫ్యామిలీ ధమాకా కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ జరిగిపోయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆహా ఓటీటీలోకి వీక్లీ ఎపిసోడ్ కింద ఈ షోను ప్రసారం చేసే అవకాశం ఉంది. ఓ పక్క హీరో, డైరెక్టర్‌గా మెప్పిస్తున్న విశ్వక్ ఇప్పుడు యాంకర్ గా కూడా మేరవనన్నాడు.