టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. శ్రీ విష్ణు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చేసే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన థియేటర్లలో సూపర్ టాక్ తో నడుస్తుంది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా మంచి ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనిపించుకుంది. శ్రీ విష్ణు కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో నటించి తక్కువ టైంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికి శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ అనేది చాలా మంది ఫేవరెట్ సినిమా అంటుంటారు. శ్రీ విష్ణు నటించిన కొన్ని సినిమాలు విజయాలను సాధించడమే కాకుండా మంచి కలెక్షన్స్ ని కూడా తెచ్చాయి. శ్రీ విష్ణు కెరీర్ లో ఈ మూడు సినిమాలు హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసాయి.
అందులో మొదటి సినిమా సామజవరగమన. తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్ లతో దూసుకెళ్తుంది. ఇదే రోజు స్పై సినిమా విడుదల అయ్యింది. కాగా స్పై సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. అయితే సామజవరగమన సినిమా మాత్రం రికార్డు కలెక్షన్స్ సాధించింది. సామజవరగమన సినిమాకి రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.77 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
బ్రోచేవారెవరురా: శ్రీ విష్ణు కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అంటే బ్రోచేవారెవరురా అనే చెప్పలి. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు అద్భుతమైన నటనతో మంచి మార్కులే కొట్టేసాడు. శ్రీ విష్ణుకి జోడిగా ఈ సినిమాలో నివేత థామస్ నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.36 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది
ఆ తరువాత ఎన్నో అంచనాల మధ్య విడువులైన సినిమా రాజ రాజ చోరా. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 6.22 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
శ్రీ విష్ణు కెరియర్లో టాప్ కలెక్షన్ లు తెచ్చింది ఈ మూడు సినిమాలే
