ఆ స్టార్ హీరో తో రంభ ఎఫైర్ నిజమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990 వ సంవత్సరంలో తన అందాలతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ రంభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమాలోకి వచ్చిన కొత్తలో ఈమె పేరును రంభ గా మార్చుకున్నది. కెరియర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ తో కలిసి చిన్న చిన్న సినిమాలలో నటించిన రంభ ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే చిరంజీవితో హిట్లర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించింది. ఇక అప్పట్లోనే రంభ తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేది.

Is yesterday's crazy heroine Rambha having an affair with that hero? »  Jstimesnow
ఇక సౌత్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసిన రంభ ఆ తర్వాత భోజ్ పురి అనే చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో ఈమెకు ప్రేక్షకులు సైతం అంత మంత్ర ముద్దులయ్యారని చెప్పవచ్చు. అక్కడ స్టార్ హీరోగా ఉన్న మనోజ్ తివారి, రవికిషన్ సింగ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించేందుకు పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ వాటిని రిజెక్ట్ చేసిందట. ఇక రంభ సినిమా విడుదలవుతున్నాయి అంటే చాలు భారీ కటౌట్లు పెట్టి మరి పాలాభిషేకాలు చేస్తూ ఉండేవారట. అంత గా భోజపురిలో రంభ క్రేజ్ సంపాదించుకుంది.

Is yesterday's crazy heroine Rambha having an affair with that hero? »  Jstimesnow
అయితే ఆ సమయంలోనే అక్కడ స్టార్ హీరోగా ఉన్న మనోజ్ తివారితో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడిపింది అని వార్తలు అప్పట్లో వైరల్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగారని కూడా సమాచారం. అలా వీరు వివాహం వరకు వచ్చిన ఈ జంట కొన్ని కారణాల చేత విడిపోయారు. అయితే అప్పటికే మనోజ్ తివారికి వివాహమైన విషయం తెలిసి ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ సినిమాలను తగ్గిస్తూ వచ్చిందట రంభ. ప్రస్తుతం ఒక ఎన్నారై తో వివాహం చేసుకొని చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతోంది రంభ.