వావ్: ఆయన డైరెక్షన్ లో బాలయ్య..రికార్డులు బద్దలవ్వాల్సిందేగా ..!

నందమూరి నట సింహం బాలకృష్ణ .. వరుస సినిమాలకు కమిట్ అవుతూ..యంగ్ హీరోలకు ధీటుగా టఫ్ కాంపీటీషన్ ఇస్తున్నారు. ఈ మధ్యనే “అఖండ” సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఈ సినిమా తో కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లో చేరారు. పైగా ఈ సినిమాలో మొదటి సారి బాలయ్య..అఘోర గా కనిపించి అభిమానులను మెప్పించాడు. బాలయ్య బోయపాటి కాంబో అనగానే ఈ సినిమా ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్.

ఇక అభిమానులను ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా..బోయపాటి..బాలయ్య ను ఇప్పటి వరకు చూపించని రోల్ చూయించి క్రేజీ హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గురించి చెప్పాలా చెప్పండి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహా. లెజండ్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మొన్న వచ్చిన అఖండ అయితే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. అయితే, ఈ హిట్ కాంబో ని మరోసారి తెర పై చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్.

చాలా మంది అభిమానులు బాలయ్య-బోయపాటి కాంబో మరో సినిమా చూడాలని సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు చేస్తున్నారు. కాగా , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ కోరిక నెరవేర బోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రూల్స్ ప్లస్ వారు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి – బాలయ్యలతో చర్చలు జరిపిన సంస్ధ ..వాళ్లు ఓకే చేయడంతో ..హ్యాపీగా ఉన్నారట. ప్రజెంట్ బాలయ్య.. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా.. ఆ తరువాత అనీల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు. అలాగే, బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వగానే బాలయ్య – బోయపాటిల నాలుగో చిత్రం ఉంటుందని సమాచారం. వీళ్ళ కాంబో లో నాలుగో సినిమా వస్తుందనగానే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకో పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా..దబిడి దిబిడే..!!