రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన `దొరసాని` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా శివాత్మికకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ రంగమార్తండ, పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే..మొదటి సినిమాలో లంగా ఓణిలో సంప్రదాయబద్దంగా కన్పించిన శివాత్మిక ఇప్పుడు గ్లామర్ దోస్ పెంచేసింది.
ఎప్పటికప్పుడు ఫొటో షూట్లు నిర్వహిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. తాజాగా కూడా కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. వాటిలో శివాత్మిక సూపర్ హాట్‌గా కనిపిస్తూ కేకపెట్టిస్తోంది.