నైజం టాప్ ఓపెనర్స్ లిస్టులో అఖండ 2.. ఏ స్థానంలో ఉందంటే..?

బాలయ్య – బోయపాటి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ఆఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో జోరుగా ఆడుతుంది. డిసెంబర్ 5న‌ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి.. డిసెంబర్ 12 కు రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల ప్రీమియర్ కూడా పడ్డాయి. ఇక.. వాటి ద్వారా దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇందులో నైజాం ఏరియాతో కూడా కలిపి.. ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే..నైజంలో ఓపెనింగ్స్‌తో టాప్ షేర్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్‌ ఏంటో.. అఖండ 2 ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం.

పుష్ప 2 రూల్.. రూ.25.60 కోట్ల‌తో నెంబర్ వన్ పొజిషన్లో నిలువగా.. ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ ఓజి రూ.24.45 కోట్ల కలెక్షన్ కల్లగొట్టింది. ఆర్‌ఆర్ఆర్ రూ.23.35 కోట్లు, దేవర పార్ట్ 1 రూ.22.64 కోట్లు, సలార్ రూ.22.55 కోట్లు, కల్కి రూ.19.60కోట్లు, గుంటూరు కారం రూ.16.45 కోట్లు, ఆదిపురుష్ రూ.13.68 కోట్లు, హరిహర వీరమల్లు రూ.12.40 కోట్లు, సర్కారు వారి పాట రూ.12.24 కోట్లు, భీమ్లా నాయక్ రూ.11.85 కోట్లు, పుష్ప పార్ట్ 1 రూ.11.44 కోట్లు, గేమ్ ఛేంజర్ రూ.10.94 కోట్లు, రాదేశ్యామ్ రూ.10.80 కోట్లు, సాహో రూ.9.41కోట్లు, బాహుబలి 2 రూ.8.9 కోట్లు,

వకీల్ సాబ్ రూ.8.75 కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.8.67 కోట్లు, బ్రో రూ.8.45 కోట్లు, సైరా న‌ర‌సింహారెడ్డి రూ.8.10 కోట్లు, ఆచార్య రూ.7.90 కోట్లు, అఖండ 2 తాండవం రూ.7.05 కోట్ల కలెక్షన్లతో టాప్ ఓపెనర్స్‌గా నిలిచాయి. ఇలా నైజం ఏరియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పట్టు టాప్ ప్లేస్ లో నిలవగా.. తాజాగా రిలీజ్ అయిన అఖండ 2 తాండవం రూ.7.09 కోట్లతో 21వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. ప్రస్తుతం ఫుల్ జోష్లో థియేటర్లలో దూసుకుపోతున్న అఖండ 2.. ఫుల్ రన్‌లో ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.