అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

స్టార్ ఆస్ట్రోలజ‌ర్ వేణు స్వామికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలా లైఫ్ కు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే వేణు స్వామి.. గ‌త కొంత కాలంగా సెల‌బ్రెటీల వార్త‌ల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌త‌ మూడు రోజుల నుంచి భగాలముఖి హోమం చేస్తూ వేణు స్వామి బిజీగా గ‌డుపుతున్నారు. ఈ విషయం తన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసుకున్నాడు. త్వరలో రిలీజ్ కాబోయే ఓ భారీ ప్రాజెక్ట్ సక్సెస్ కోసమే ఈ హోమాన్ని చేపట్టాన‌ని వివరించాడు.

Venu Swamy speaks about Naga Chaitanya-Sobhita Dhulipala's future

ఇక ప్రస్తుతం బడా ప్రాజెక్టు అంటే బాలయ్య అఖండ 2 తప్ప మరేది కనిపించడం లేదు. ఈ నెల మొత్తంలో భారీ బడ్జెట్ తో ఆడియన్స్‌ను పలకరించనున ఏకైక మూవీ ఇదే. ఇక.. సంక్రాంతికి వచ్చే సినిమాల వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఏది కూడా కంప్లీటై స్పెషల్ హోమాల వరకు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఈ హోమం వేణు స్వామి చేసిన.. లేదా ఆయన చేత చేయించిన భగాలముఖి హోమం కేవలం అఖండ 2 మూవీ కోసం తప్ప మరేవి కాదంటూ క్లారిటీ వచ్చేసింది.

ఇక్క‌డ మ‌రో పాయింట్ అటు బాలయ్య, బోయపాటి కూడా ఎప్పుడు సనాతన సాంప్రదాయాన్ని న‌మ్ముతారు. బాలయ్య హోమం లాంటి వాటికి కాస్త దూరంగా ఉన్నా కానీ.. వాస్తు, జ్యోతిష్యం, ముహుర్తాలపై చాలా గట్టి నమ్మకం. బాల‌య్య‌బాబులానే.. బోయ‌పాటి కూడా.. ఎవరైనా కలవాలంటే కూడా ముహూర్తాలు చూసుకుంటూ ఉంటాడు. ఇద్ద‌రి ఆలోచ‌న‌లు సేమ్ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ హోమం చేయిస్తుంది కూడా.. బోయపాటి, బాలయ్యే అయ్యి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బోయపాటి చేపించకుండా ఆయన చెబితే ఎవరైనా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఈ హోమం ఫలించి అఖండ 2 మంచి సక్సెస్ అందుకుంటే మాత్రం వేణు స్వామి రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.