వారణాసి: హైలి రికమండేడ్ హీరో ఎంట్రీ.. మొదట వద్దనుకున్న వ్యక్తినే తీసుకొచ్చిన జక్కన్న..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విల‌న్‌గా మెర‌వ‌నున్నారు. ఇక.. ఈ ప్రాజెక్ట్ పై.. సినిమా సెట్స్‌ పైకి రాకముందు నుంచి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం రాజమౌళి సినిమా అయితే చాలు.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాంటి రాజమౌళి.. మహేష్ బాబు తో మొదటిసారి ఓ సినిమా తీస్తున్నాడు.

సినీ ఆడియన్స్‌.. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా వారణాసి బాక్ డ్రాప్ లో రూపొందుట. భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిగా పేర్కొన్న వారణాసి నేప‌ధ్యంలో సినిమా సాగుతుందని టాక్‌.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేసింది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారుతుంది. సినిమాలో మహేష్ తండ్రి రోల్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని.. ఈ పాత్ర ఎమోషన్ కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమా అనుకున్నప్పటి నుంచి ఆ రోల్ కోసం.. రాజమౌళి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారట.

మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారని ఎన్నో లుక్ టెస్ట్ లు నిర్వహించాడట. ముఖ్యంగా ఆ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఎవరినైనా తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాడట. అయితే.. స్టోరీ డిమాండ్, రోల్ డెప్త్, ఎక్స్పీరియన్స్.. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ రాజ్ అయితేనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలరని మేకర్స్ అంతా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్‌ పేరు రాజమౌళి కాదు.. ఆయన సన్నిహితులు, ఇతర సినీ వర్గాల నుంచి ఎక్కువగా రికమెండ్ చేశారట. ఈ విషయంలో జక్కన్న మొదట కాస్త సందేహపడినా.. ఎంతోమందితో చర్చల తర్వాత రాజమౌళి కూడా ప్రకాష్ రాజ్‌ సారైనా ఛాయిస్ అని డెసిషన్‌కు వచ్చారట. తాజా సమాచారం ప్రకారం.. తండ్రి – కొడుకులుగా మహేష్, ప్రకాష్ రాజుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ గా మారనున్నాయట.