అఖండ 2 వరల్డ్ వైడ్ టార్కెట్ ఇదే ఏ ఏరియాలో ఎంతంటే..?

బాలకృష్ణ – బోయపాటి ఆఖండ 2 సినిమా ఎట్టకేలకు వివాదాలన్నింటినీ క్లియర్ చేసుకుని ప్రారంభం కానుంది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, బోయపాటి హాట్రిక్ కాంబోలో సినిమా రూపొందుతుండడం.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమాకు భారీ లెవెల్ బిజినెస్ కూడా జరిగిందట‌. ఇంతకీ ఆ బిజినెస్ లెక్కలు ఏంటి.. వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ఎంత టార్గెట్ తో సినిమా రంగంలోకి దిగుతుందో ఒకసారి చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని అఖండ 2.. ఓవరాల్ గా రూ.80.50 కోట్ల టార్గెట్తో రంగంలోకి దిగనుంది. నైజంలో రూ.20.50 కోట్లు, సీడెడ్‌లో రూ.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11 కోట్లు, ఈస్ట్ లో రూ.7.20 కోట్లు, వెస్ట్ లో రూ.5 కోట్లు, గుంటూరులో రూ.8 కోట్లు, కృష్ణాజిల్లా రూ5.20 కోట్లు, నెల్లూరు రూ.3.60 కోట్ల బిగ్ టార్గెట్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, అలాగే దుబాయ్ తో కలుపుకొని రూ.10 కోట్ల టార్గెట్ తో రంగంలోకి సిద్ధమవుతుందట.

ఓవర్సీస్ లో అయితే రూ.12.50 కోట్ల టార్గెట్టా దిగుతున్నట్లు సమాచారం. ఇలా అఖండ 2.. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.103 కోట్ల బడా టార్గెట్ తో దిగనుంది. ఈ క్రమంలోని సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి.. రికార్డులు క్రియేట్ చేయాలంటే.. రూ.105 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలి. ప్రస్తుతం సినిమాకు ఉన్న హైప్‌ రీత్యా ఈ కలెక్షన్లు పెద్ద కష్టమేమీ కాదని.. చాలా సులువుగానే బాలయ్య ఈ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడంట ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. బాలయ్య రుద్రతాండవం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.