తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పిన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. కేవలం సినిమా ప్రొడక్షన్ ఏ కాదు, డిజిటల్ వ్యాపార రంగంలోనూ తెలంగాణ అవకాశాలు రూ.1000 కోట్ల టర్నోవర్ విజన్‌పై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ఈ కామెంట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అల్లు అరవింద్ కు ఇప్పటికే ట్రెండుకు అడుగు ముందే ఉంటారని ఇమేజ్ ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ విజన్ 2025 సమీట్లో ఆయన చేసిన కామెంట్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై.. ఆయనకు ఉన్న మాస్ విజన్ క్లియర్ అయ్యింది.

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం థియేటర్లకే కాదు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా అంటూ వివరించాడు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై పట్టు తోను భవిష్యత్తులో 1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంలో ఇస్తున్న ప్రోత్సాహం అద్భుతమంటూ పేర్కొన్నాడు. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ తో డిజిటల్ రంగంలో మాస్ లీడర్ గా ఇప్పటికే సత్తా చాటుకున్న అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్లు.. తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానం, యువత నైపుణ్యం ఎక్కువగా ఉన్నాయని.. సినీ పరిశ్రమకు ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉందంటూ చెప్పుకోచ్చిన అరవింద్.. మేము గీత తరపున తెలంగాణలో మరిన్ని స్టూడియోలు, కంటెంట్ ప్రొడక్షన్ యూనిట్లను స్థాపించినందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.

దీంతో రాష్ట్రంలో భారీ పేట్టుబడులకు ఆయన హింట్ ఇచ్చాడు. నూతన దర్శకులకు మాస్ అవకాశం ఇది.. కొత్త దర్శకులు, రైటర్లు తమ కథలను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తే తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ వేదిక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఒక కొత్త రక్తాన్ని పంపుతుందంటూ.. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేలా కామెంట్ చేసాడు. అల్లు అరవింద్ గ్లోబల్ సమ్మిట్‌లో చేసిన ఈ కామెంట్స్‌తో ఆయనకున్న బిజినెస్ క్రియేటివిటీవి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక తెలంగాణ విజన్ 2025 లాంటి వేదికపై అల్లు అరవింద్ లాంటి మాస్ నిర్మాతల సపోర్ట్ ఉంటే.. ఇది సినీ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు.

