డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని నమ్మకంతో తమ సినిమాల రిలీజ్‌కు చిన్న సినిమాల మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు. వాటిలో.. మొగ్లీ, సైక్ సిద్ధార్థ, అన్నగారు వస్తున్నారు, ఈషా. సహ కుటుంబానాం, నా తెలుగోడు లాంటి సినిమాలు సైతం ఉన్నాయి. వీటికి మంచి బజ్ కూడా నెలకొంది. అఖండ 2 కొత్త రిలీజ్ ఎఫెక్ట్‌తో చాలా సినిమాలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అఖండ 2 రిలీజ్ పై ఈషా నిర్మాత బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో హెబ్బా పటేల్, త్రిగుణ్ తదితరులు కీలక పాత్రలు మెరవనున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు బన్నీవాస్, కెఎల్ దామోదర్ ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. పెద్ద హీరోలతో సినిమా తీసిన.. రెండు కోట్ల రూపాయలతో తీసినా.. అది సినిమానే. వ్యాపారమే. ఒక స్టార్ హీరో కొత్త సినిమా వస్తుందంటే జనంలో ఉత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. వాళ్లకు ఉన్న ఫ్యాన్ బేస్ కానీ, మరి ఏదైనా కారణమే కానీ.. జరిగేది ఏదో దురదృష్టవశాతం జరిగిపోయింది. 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 12న ఈ సినిమా రావడం మా లాంటి వాళ్లకు ఇబ్బందే.. ఇండస్ట్రీలో ఎవరు బిజినెస్ వాళ్లకు ఉంటుంది. చాంబర్లో వందల కొద్ది పరిష్కారాలు మాట్లాడుకుంటూనే ఉంటాం. నెల రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అంతా కామన్. సినీ పరిశ్రమ సరైన ఆర్గనైజేడ్ అంటూ వెల్లడించిన ప్రొడ్యూసర్ దామోదర్.. ఇక జై బాలయ్య అనాల్సిందే అంటూ వివరించాడు.

ఈ బిజినెస్‌లో చిన్న సినిమాకు సేఫ్టీ కోరుకుంటాం. ఆ లైన్లో మేము వెళ్లిపోతాం అంతే. దాని గురించి ఎవరికీ ఏం చెప్పనవసరలేదు.. అఖండ 2 ఎఫెక్ట్ కచ్చితంగా మా సినిమాపై పడుతుంది.. అదేరోజున 16 సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 12న రావడంతో 16 మంది ఏదో రకంగా సినిమాలో డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్న పరిస్థితిని. ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిందే అంటూ దామోదర్ వెళ్లడించారు. ఇక దీనిపై నిర్మాత బన్నీ వాస్ రియాక్ట్ అవుతూ.. హైవే మీద మనం చిన్న కారు వేసుకొని వెళ్తున్నా.. వెనకాల పెద్ద లారీ వచ్చి హారన్ కొడుతుంది.. ఏం చేస్తాం. సైడ్ తప్పుకోవాల్సిందే కదా. లేదు అని అలాగే ముందుకు వెళ్తే వెనుక నుంచి టచ్ ఇస్తే ఎక్కడకో వెళ్లి పడతాం. అందుకే సైడ్ ఇచ్చి పెద్ద బండిని వదిలేయడం బెటర్ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం బన్నీ వాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


