బాలకృష్ణ – బోయపాటి అఖండ 2 తాండవం సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియరైన తర్వాత ఈ మూవీని డిసెంబర్ 12న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఇక సినిమా ప్రీమియర్స్ ఈరోజు(డిసెంబర్ 11) రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. సినిమా ఆలస్యం కూడా మేకర్స్ కు కలిసి వచ్చిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే.. సినిమాపై హైప్ మరింతగా పెరిగింది.
దీంతో.. సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోను ఇదే రేంజ్ బుకింగ్స్ జరుగుతుండడం విశేషం. ఇక.. ప్రీమియర్ బుకింగ్స్ కూడా తాజాగా మొదలైపోయాయి. అయితే.. అఖండ 2 డిసెంబర్ 12 కు ఫిక్స్ చేయకముందు.. చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. అందులో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్, అన్నగారు వస్తారు, ఈషా లాంటి సినిమాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే కాదు.. ప్రమోషన్స్‌ని కూడా భారీ లెవెల్ లో చేసి సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే.. ఈ సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంత భావించారు. అలాంటి టైం లో అఖండ 2 రావడంతో.. ఈ సినిమాల రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా కావడం.. అది కూడా అఖండ లాంటి బ్లాక్ బస్టర్కు సీక్వెల్ కావడంతో చిన్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైడ్ అయిపోతున్నాయి. అయితే.. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ మాత్రం అన్నగారు వస్తారు సినిమా కోసం బాలయ్యతో పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రావాల్సింది. కానీ.. అఖండ 2 మొదటి వారంలో ఉండడంతో.. కార్తీ తన మూవీ వాయిదా వేసి డిసెంబర్ 12 కు సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 12 కి అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే.. ఈసారి మాత్రం అన్నగారు వస్తారు సినిమా పోస్ట్ పని చేయడం కుదరలేదు. థియేటర్స్ లో ఇప్పుడు అఖండ 2కు పోటీగా ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే.. యంగ్ హీరో రోషన్ కనకాల మొగ్లి మూవీ డిసెంబర్ 13 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంటే కేవలం ఒక్కరోజు వాయిదా తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక మరో యంగ్ హీరో శ్రీనందు నటించిన సైక్ సిద్ధార్థ్ జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. ఈషాను డిసెంబర్ 25 లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇలా.. బాలయ్య దెబ్బకు సినిమా విషయంలో బిగ్ గందరగోళం నెలకొంది.


