ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ 2 మానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలయ్య, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడంలో మంచి ఆశక్తి నెలకొంది. కాగా మొదట డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమాని అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు అన్ని ఈష్యూస్ క్లియర్ చేసేసి.. డిసెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక డిసెంబర్ 11 రాత్రి( మరికొద్ది గంటల్లో) సినిమా ప్రీవియర్స్ ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలోనే.. సినిమా పక్కాగా టైం కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు ఇప్పటికీ చాలామందిలో వినిపిస్తూనే ఉన్నా.. నిర్మాతలు మాత్రం ఈసారి రిలీజ్ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా పక్క ప్లానింగ్ తో దిగనున్నారట. కానీ అఖండ 2 కొత్త రిలీజ్ డేట్‌తో చిన్న సినిమాల విషయంలో బిగ్ షాక్ తగిలింది. ఇదే రోజు దాదాపు 16 సినిమాలు రిలీజ్ ఉండగ.. ఇప్పటికే అఖండ 2 ఎంట్రీతో చాలా వరకు సైలెంట్ అయిపోయాయి. రిలీజ్ డేట్ మార్చుకుని పక్కకు తప్పుకున్నాయి. ఇక ఈ 16 సినిమాల్లో.. టాలీవుడ్ లో ఈషా, మొగ్లీ, అన్నగారు వస్తారు సినిమాలకు భారీ క్రేజ్ నెలకొంది. వీటిలో మోగ్లీ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ఒకరోజు ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేసేందుకు టీం సిద్ధమయ్యారు.
ఇక కార్తీ సినిమా అన్నగారు వస్తారు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే అనుకున్న టైం కు అంటే డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో పాట్టే.. సూపర్ సార్ రజనీకాంత్ డిసెంబర్ 12కు 75 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న క్రమంలో.. ఆయన.. శివాజీ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. థియేటర్ల సమస్యతో ఈ సినిమాను కూడా ఆపేశారు. ఇక కొత్త సినిమాల్లో మరో రెండు సినిమాలు ఈషా, సకుటుంబా నాం సినిమాలు.. డిసెంబర్ 25న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక.. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో మూవీ సైక్ సిద్ధార్థ జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీనిపై ఆఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే.. ఎలాంటి ప్రచారాలు లేకుండా నాలుగు రోజుల క్రితం టీజర్, రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేసుకున్న ఆది పినిశెట్టి డ్రైవ్ సినిమా చెడేటప్పుడు లేకుండా రిలీజ్ అవడానికి సిద్ధమవుతుంది.
ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలా వరకు చిన్న సినిమాలు పక్కకు తప్పుకుంటాయి. ఎందుకంటే థియేటర్లో సమస్య, అలాగే స్టార్ హీరోకు అన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని. కానీ ఈ సారీ కొందరు నిర్మాతలు తమ సినిమాల కోసం ధైర్యం చేసి బిగ్ మూవ్ కు సిద్దమవుతున్నారు. అదే.. భారీ సినిమాల రిలీజ్ రోజున.. తమ సినిమాను కూడా రిలీజ్ చేయడం. కారణం పెద్ద సినిమాల కోసం క్యూ కట్టిన జనం ఓవర్ ఫ్లోలో చిన్న సినిమాలను కూడా చూస్తారని. అంతో ఇంతో కలిసొస్తుందని.. అలా బిగ్ మూవీస్ తో పాటు రిలీజ్ అయి మంచి వసూళ్లు దక్కించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే.. అఖండ 2 రిలీజ్ అయిన మరుసటి రోజే.. మోగ్లీ సినిమాకు మేకర్స్ సిద్ధవయ్యారట. ఇక ఈ సినిమాతో పాటు అఖండ 2 తో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయి చూడాలి.


