అఖండ 2 థియేటర్లో ఆధ్యాత్మికత.. క్లైమాక్స్ చూసి మహిళకు పూనకం..వీడియో వైరల్

గాడ్ ఆఫ్‌ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి హాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా.. హర్షాలి మల్హోత్ర ప్రధాన పాత్రలు నటించిన సినిమాకు 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. డిసెంబర్ 12న

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. థియేటర్లో హౌస్ ఫుల్‌తో సందడి చేస్తుంది. మొదటి రోజు 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టిన ఈ సినిమా.. ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుందనే చెప్పాలి. చిన్న, పెద్దా అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేసేలా.. బోయపాటి డిజైన్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక.. ప్రస్తుతం సినిమాను చూస్తున్న ఆడియన్స్ ఆధ్యాత్మికతను ఫీల్ అవుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒంగోలులో అఖండ 2 దియేటర్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. థియేటర్లో సినిమా చూస్తున్న టైం లో క్లైమాక్స్‌కు ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. సినిమాలో శివుడు తాండవం ఆడే సీన్‌ చూస్తూ.. ఆయనకు దండం పెడుతూ.. పూనకంతో శివనామ స్మరణం చేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారడంతో.. సినిమా సనాతన ధర్మం, శివతత్వాన్ని తెలియజేసేలా రుద్ర రూపాన్ని చూపించేలా బోయపాటి శీను చాలా చక్కగా ఆవిష్కరించాడంటూ.. ఆఘోరగా నందమూరి బాలకృష్ణ జీవించేసారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.