టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్ ప్రారంభంలో యూత్‌కి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో ఎక్కువగా మెరిసిన నాని.. వరుస సక్సెస్‌లు అందుకున్న క్రమంలో.. కేవలం ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్లే కాదు.. యాక్షన్ మోడ్‌లో తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే.. ఆయన గురించి చివరికి వచ్చిన హిట్ 3తో బ్లడ్ బాత్ చూపించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో ది ప్యారడైజ్.
ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా యాక్షన్ ఎంటర్టైనర్లే. అయితే.. తాజా సమాచారం ప్రకారం నాని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఓ క్లాసికల్ లవ్ స్టోరీ లో కనిపించనున్నడట. 96, సత్యం సుందరం లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా నటించనున్నట్లు సమాచారం. కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్లో ప్రేమ్ కుమార్ రూపొందించిన సత్యం సుందరం.. నాని ఫేవరెట్ మూవీ.

ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో డైరెక్టర్ పై ఎంతగానో ప్రశంసలు కురిపించిన నాని.. రీసెంట్గా ప్రేమ్ కుమార్ చెప్పిన ఒక కథను వినడట. ఇక ఆ స్టోరీ నానికి తెగ నచ్చేయడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. నాని దీనికి ఓకే చేసిన.. ప్రాజెక్ట్ మాత్రం సెట్స్‌పైకి రావడానికి మరో రెండేళ్లయినా పడుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ది పారడైజ్తో పాటు.. సుజిత్ సినిమాను కూడా కంప్లీట్ చేసిన తర్వాత.. ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో సినిమా నటించే ఛాన్స్ ఉంది.


