నన్ను చూసుకునే నా పొగరు.. వ్యక్తిత్వం విప్లవం.. వృత్తే నా దైవం..బాలకృష్ణ

బాలయ్య, బోయపాటి బ్లాక్ బ‌స్టర్ కాంబోలో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం ప్రతిష్టాత్మకంగా రూపొందిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ తెర‌కెక్కించారు. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమా.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ సక్సెస్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మేకర్స్‌ అఖండ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు.. యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ ఉద్దేశంతో సినిమా తీశామో.. ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం కచ్చితంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూసి ఆడియన్స్‌.. సనాతన హైందవ ధర్మం మీసం వేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం.. మన గర్వం.. మన తేజస్సు కలగలిపిన సినిమా ఇది. అపాల బోపాలానే అలరించిందని యావత్ ప్రపంచం అంటుంది.. ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం. ప్రకంపనం.

సినిమా ద్వారా మనం ఆడియన్స్ కి ఇచ్చే సందేశం ఎలా ఉండాలని.. ఆలోచించాలి. వరుసగా నా ఐదు సినిమాలు సక్సెస్ సాధించినందుకు నేను గర్వంగా ఉన్నా. రేపు రాబోతున్న సినిమా కూడా మంచి చరిత్ర సృష్టిస్తుంది. చరిత్రలో ఇంకా చాలామంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి.. తిరిగి చరిత్ర సృష్టించేవాడు మాత్రం ఒక్కడే. అదే తెలియని శక్తి. ఎవరిని చూసుకొని రా బాలకృష్ణకు అంత పొగరు అని చాలామంది అంటారు. నా వ్యక్తిత్వమే నన్ను రెచ్చగొట్టే విప్లవం.. నన్ను నేను తెలుసుకోవడమే నా పొగరు.. వృత్తి నా దైవం.. ఆ వృత్తిలో భాగమే అఖండ సినిమాలో నా పాత్ర. పాత్ర చేయడం అంటే పరకాయ ప్రవేశం అంటు వివరించాడు. ఇక అఖండ సినిమా నాకు పరీక్ష లాంటిది. కోవిడ్‌ టైంలో అసలు జనం వస్తారా అనే సందేహం ఉన్న టైంలో సినిమా రిలీజ్ చేశాం. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూసాం.

ఈ సినిమా తర్వాత నాకు వరుసగా వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ తాండవం నాలుగు సక్సెస్ లు వచ్చాయి. ఇక సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు.. దాని యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత పడింది అనేది ముఖ్యం. ఇలాంటి టైంలో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించడం మాకు సంతోషాన్ని కలిగించింది. సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. దిల్ రాజు గారికి, మ్యాంగో రాము గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేందర్ గారికి.. సినిమా రిలీజ్ కావడానికి వాళ్ళు పడ్డ శ్రమకు కృతజ్ఞతలు. ఇక సినిమా వాయిదా ప‌డ‌టం.. మేము దేవుడు పెట్టిన పరీక్ష గా భావిస్తున్నాం. సినిమాకు అఖండమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.