తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన దర్శకుడు ఎవరంటే టక్కున ఎస్ఎస్ రాజమౌళి పేరు వినిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఇంటర్నేషనల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు జక్కన్న. ఈ సినిమాలు చూసిన తర్వాత.. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన స్టీఫెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరూన్ లాంటి వాళ్లు సైతం.. తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక తాజాగా జేమ్స్ కెమెరాను తన కొత్త సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ లో.. రాజమౌళితో ప్రత్యేక వీడియో చాట్ లో సందడి చేయడం విశేషం. ఈ సంభాషణలో రాజమౌళి హీరోగా.. మహేష్ నటిస్తున్న వారణాసి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. వీడియోలో జేమ్స్ కామెరున్ మాట్లాడుతూ.. మీరు వారణాసి సినిమా షూటింగ్ చాలా కాలంగా చేస్తున్నారని విన్నా అది నిజమేనా అని అడగగా.. దానికి రాజమౌళి రియాక్ట్ అవుతూ అవును సార్. దాదాపు ఏడాది నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా.. ఎనిమిది నెలలు షూటింగ్ మిగిలిందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ మధ్య దశలో ఉన్నామని వివరించాడు. దీనిపై జేమ్స్ కామెరున్ సరదాగా రియాక్ట్ అవుతూ.. అయితే ఇంకా చాలా టైం ఉంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటే ఉదాహరణకు పులులు లాంటి సీన్లు ఉంటే.. నాకు చెప్పండి అంటూ రియాక్ట్ అయ్యాడు.
![]()
రాజమౌళి కూడా వెంటనే స్పందిస్తూ.. జేమ్స్ కామెరున్ వారణాసి సినిమా సెట్స్‌కు రావడం నాకు మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినీ రంగానికి గౌరవంగా ఉంటుంది అంటూ వివరించాడు. ఈ మాటలకు జేమ్స్ కామెరున్ కూడా సానుకూలంగా రియాక్ట్ అవుతూ.. నాకు అవకాశం దొరికితే నేను కూడా కెమెరా పట్టి కొన్ని సెకండ్ యూనిట్ షాట్స్ తీయాలనుకుంటున్నా అంటూ వివరించాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ సరదా సంభాషణ ఆడియన్స్‌లో ఆసక్తిని కలిగిస్తుంది. ఓవైపు భారతీయ సినిమా, మరోవైపు హాలీవుడ్ ఈ రెండు ప్రపంచాలను కలిపేలా వీళ్ల సంభాషణ ఉండడం.. ఈ రెండు సినిమాల ప్రమోషన్లకు కూడా ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ తో రెండు వైపుల నుంచి ఈ సినిమాలపై ఆడియన్స్ లో హైప్ మొదలైంది.


