బోయపాటి – బాలయ్య కాంబోలో రూపొందిన మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా.. అనూహ్య కారణాలతో వాయిదా పడింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం కూడా ఒకందుకు మంచిదే అయింది అంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. నిజానికి.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ అంటే సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్‌లో ఉంటాయి. అయితే.. అఖండ 2 కు ఆ రేంజ్ అంచనాలు లేవనే చెప్పాలి. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ కాస్త నిరాశ మిగిల్చింది. ఈ క్రమంలోనే బుకింగ్ విషయంలో క్లియర్ కట్గా అది కనిపించింది.
అయితే.. ఫైనాన్షియల్ సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడటం కూడా ప్లస్ పాయింట్ అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. కారణం గతంలోను ఇలా పలు పెద్ద సినిమాలు ఏవో అడ్డంకుల కారణంగా.. వివాదాలతో రిలీజ్ కాకుండా ఆగిపోయి.. తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటి సీఎంగా రాణిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా విషయంలో కూడా గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తర్వాత.. ఈ సినిమా భారీ లెవెల్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది.
ఇక.. ఇప్పుడు అఖండ 2 విషయంలోను సినిమా వాయిదా పడడం.. ప్రమోషన్స్‌కు మరింత సమయాన్ని తెచ్చి పెట్టింది. సినిమా పూర్తి లెవెల్‌లో నాణ్యత, పగడ్బందీ ప్లాన్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆసక్తిని పెంచేలా మేకర్స్ ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మాస్ ఆడియన్స్‌కు బాలయ్య – బోయపాటి కాంబో అంటేనే పెద్ద పండుగ. అలాంటిది అఖండ లాంటి పవర్ఫుల్ కంటెంట్ సీక్వెల్ గా వస్తున్న మూవీ కావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం కాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.



