నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకునే ఆడియన్స్‌ను పలకరించింది. శుక్రవారం డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. ముఖ్యంగా బాలయ్య రుద్రతాండవం థియేటర్లను షేక్ చేసిందని చెప్పాలి. ఆయన యాక్షన్ సీక్వెన్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక.. బోయపాటి సినిమాలంటేనే భారీ కాస్టింగ్. అలానే అఖండ 2లోను స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది నటించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరవగా.. భజరంగి భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్ర బాలయ్య కూతురుగా నటించింది.
జగపతిబాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, శాశ్వత చటర్జీ, అచ్యుత్ కుమార్, ,పూర్ణ , సాయి కుమార్, హర్ష, మురళీమోహన్ లాంటి ఎంతోమంది కీలకపాత్రలో నటించారు. అయితే.. వీళ్లలో చాలామంది నెగటివ్ షేడ్స్ లో విలన్లుగా కనిపించారు. ఇక ఆది పినిశెట్టి అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. తాంత్రికుడు పాత్రలో అతని గెటప్, బాడీ లాంగ్వేజ్.. ఆడియన్స్‌ను భయపెట్టిందని చెప్పాలి. ఇక నెగటివ్ ష|ఏడ్స్తో కూడుకున్న ఈ తాంత్రికను క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఛాయిస్ ఆది పినిశెట్టి కాదని.. ఆయన కంటే ముందు చాలామంది స్టార్స్‌ను అప్రోచ్ అయ్యిడట బోయపాటి.
మంచు మనోజ్ కు ఈ ఆఫర్ రాగా.. బోయపాటి స్వయంగా కథను వినిపించినా.. మనోజ్ అప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. తర్వాత.. ఇదే పాత్ర కోసం కొంతమంది హీరోలను కూడా బోయపాటి అప్రోచ్ అయ్యాడు. కానీ.. ఎవరు ఈ రోల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో.. ఆది పినిశెట్టిని అప్రోచ్ కాగా.. స్టోరీ విన్న వెంటనే ఆయనకు ఒకే అనిపించిందట. ఫ్రెండ్స్ కూడా ఈ పాత్రలో చేయమని సజెస్ట్ చేయడంతో ఆది గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా.. ఈ రోల్‌కు ముందు ఎంతో మంది స్టార్స్‌ను అనుకున్నా.. ఫైనల్ గా ఆది పినిశెట్టి ఈ పాత్రలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.



