ఇండస్ట్రీలో అంత ఇమేజ్ ఉన్నా.. బాలయ్య ” అఖండ 2 ” విషయంలో మాట్లాడక పోవడానికి కారణం అదేనా..?

ప్రెసెంట్ ఎక్కడ చూసినా అఖండ 2 వాయిదా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. డిసెంబర్ 5న రావ‌ల్సిన సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందని అసలు ఎవరూ ఊహిచ్చి ఉండరు. సెట్స్ పైకి రాకముందే భారీ అంచ‌నాలు నెల‌కొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్లతో అదరగొడుతుందని.. ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ లెక్కలు నెటింట‌ మోత మోగిపోతాయని అభిమానులంతా భావించారు. ఇక సినిమా అర్ధాంతరగా ఆగిపోయింది. ఫైనాన్స్ షేర్, లీగల్ ఇష్యుల కారణంగా హైకోర్టు స్టే ఆర్డ‌ర్తో తాత్కాలికంగా ఆపేశారు. ఇది ఫ్యాన్స్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ లీగల్ ఇష్యూస్, ఫైనాన్సియల్ సమస్యలు పూర్తిగా సాటర్ అయిపోయాయట. సమస్య పరిష్కారమైనా వెంటనే సినిమా రిలీజ్ చేయాలనీ మాత్రం మేకర్స్ భావించ‌ట్లేద‌ట‌.

కొంత సమయం తీసుకుని ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ పరిశీలించి ఆ రోజే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక బాలయ్యకు సంక్రాంతి సీజన్ అంటేనే కలిసి వచ్చే సీజ‌న్‌. ఈ క్రమంలోనే వచ్చే నది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా విషయంలో మరో హాట్‌ టాపిక్ బాలయ్య అఖండ 2 వాయిదా పై రియాక్ట్ కాకపోవడం. ఇండస్ట్రీలో, రాజకీయాల్లో భారీ పలుకుబడి ఉన్న బాలయ్యకు.. కోపం కూడా ఎక్కువ ల‌ని టాక్‌. అయితే ఇంత పెద్ద ఇష్యూ జరిగిన బాల‌య్య రియాక్ట్ కాక‌పోవ‌డంతో కొంత‌మంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య మాట్లాడకపోవడానికి కారణం.. ప్రస్తుతం కోపం పరిష్కారం కాదని ఆలోచన చేసి.. ఆచితూచిఅడుగులు వేయాలని ఆలోచిస్తున్నాడట‌. అభిమానుల ప్రేమ, ఇమేజ్, స్టార్ పవర్, రాజకీయాల్లో పేరు ఉన్న కోపం చూపించి మేకర్స్ పై ఒత్తిడి తెస్తే.. ఆ ఇష్యూ మరింత పెద్దదవుతుంది కానీ ఎక్కడ సమస్యకు పరిష్కారం దొరకదు.

ఈ క్రమంలోనే బాలయ్య సైలెంట్ గా ఉండిపోయారంటూ తెలుస్తోంది. ఇక బాల‌య్య‌కు మొదటి నుంచి సినిమా అంటే కేవలం రికార్డులు కాదు.. సినిమా పైన ఉన్న గౌరవం వేరు. కార్మికుల కష్టాన్ని కూడా ఆయన చూస్తుంటారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్.. ఈ కారణాలతో పూర్తిగా ఆగిపోతే.. సినిమాకు పని చేస్తే టెక్నీషియన్ల దగ్గర నుంచి ఫైనాన్స్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పరిస్థితి క్లియర్ అయ్యేవరకు పేష‌న్స్‌తో ఉండాలని.. అప్పుడే వీళ్ళందరికీ మేలు జరుగుతుందని భావిస్తున్నారట. బాలయ్యకు ప్రస్తుతం ఉన్న పేరు, ప్రఖ్యాతలతో ఇలాంటి సమస్యలను పరిష్కరించడం చాలా చిన్న విషయం. కానీ.. ఎదుటి వ్యక్తికి కూడా మోసం జరగకుండా ఎలాంటి నష్టం లేకుండా నిజాయితీగా.. తమ సినిమా రిలీజ్ కావాలని బాలయ్య భావిస్తున్నాడని.. ఈ క్రమంలోనే మేకర్స్‌కు కొంత సహాయం చేసి సైలెంట్‌గా ఉండిపోయాడని.. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.