అఖండ 2 కోసం బోయపాటి ఊర మాస్ ప్లాన్.. బాలయ్య చేత ఆ పని..!

బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో కొద్ది గంటల ముందు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెల‌కొంది. అంతేకాదు సినిమా విషయంలో భారీ నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. ఇక ఎట్టకేలకు సినిమా అన్ని ఆటంకాలను దాటుకొని.. ఫైనల్ సమస్యలను క్లియర్ చేసి కోర్ట్ నుంచి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ డిసెంబర్ 12న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు డిసెంబర్ 11 రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయ‌నున్నారట.

ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. రిలీజ్ వాయిదా విషయంలో వచ్చిన నెగటివ్ కామెంట్స్ ను పూర్తిగా సినిమాకు పాజిటివ్ గా మార్చేయాలని డైరెక్టర్ బోయపాటి భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆయన ఓ ఊర మాస్ ప్లానింగ్ వేసడట. అది కూడా బాలయ్యను స్వయంగా రంగంలోకి దింపుతున్నాడు అంటూ టాక్. అసలు మేటర్ ఏంటంటే సినిమా రిలీజ్ కు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ప్రీమియర్స్‌కు కొద్ది క్షణాల ముందు స్వయంగా బాలయ్య చేత ప్రత్యేక వీడియోను రిలీజ్ చేయించాలని బోయపాటి ఫిక్స్ అయ్యాడట. ఈ వీడియోలో సినిమా అసలు డిసెంబర్ 5న రాకుండా ఎందుకు వాయిదా పడింది.. అలాగే సినిమా వాయిదాకు సమస్యలేంటి.. ఇక సినిమా రేంజ్‌,గ్రాఫ్ వివ‌రించ‌నున్నాడ‌ని.. తెలుస్తుంది.

ఇప్పటివరకు వచ్చిన నెగటివ్ వార్తలన్నింటికీ పూర్తిగా చెక్ పెట్టాలని బోయపాటి ఈ డెసిషన్ తీసుకున్నడ‌ట‌. సాధారణంగా బాలయ్య ఇలాంటి విషయాలపై పెద్దగా చర్చించారు.. అలాంటిది అఖండ 2 కోసం మొదటిసారి రిలీజ్ కు కొన్ని గంటల ముందు స్పెషల్ మెసేజ్ రిలీజ్ చేయడానికి సైతం ఒప్పుకున్నాడట. అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య – బోయపాటి మరోసారి ఆఖండ 2తో ఆడియన్స్ ఆకట్టుకునేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకొని.. బోయపాటి ఈ ప్లాన్ చేశాడ‌ట‌. ఈ క్లారిటీతో సినిమాపై పూర్తిగా నెగెటివిటీ తుడిచిపెట్టి పోయే అవకాశం ఉందని టీమ్ అయితే భావిస్తున్నారు. ఇక డిసెంబర్ 12న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.