టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. సింహా ,లెజెండ్, అఖండ లాంటి వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన 4వ సినిమా కావడం.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందిన క్రమంలో.. ఆడియన్స్‌లో మొదటినుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ తరుణం వచ్చేసిందని.. డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం 9:30 నుంచి చాలా చోట్ల ప్రీమియర్స్ పడనున్నాయని.. మరి కొద్దిగంటలోనే ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చని ఫ్యాన్స్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రీమియర్ బుకింగ్స్ ప్రారంభమై హార్ట్ కేకుల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి క్రమంలో ఫ్యాన్స్‌తో పాటు.. అఖండ 2 టీం కూడా బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. అసలు మేటర్ ఏంటంటే.. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్‌ను ఆపేయాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖండ 2 ప్రొడక్షన్ బ్యానర్ అయిన 14 ప్లస్.. తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆ డబ్బులు చెల్లించకుండా.. ఇబ్బంది పెడుతున్నారని.. ఈ రోజ్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో.. హైకోర్ట్ వాళ్లకు మద్దతు తెలుపుతూ.. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించిన అఖండ 2 సినిమా రిలీజ్ ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ లో మూవీ రిలీజ్ విషయంలో ఆందోళన నెలకొంది. దీనిపై ప్రొడక్షన్ బ్యానర్ ఎలా రియాక్ట్ అవుతుందో.. సినిమా రిలీజ్ ఆగకుండా ఎం చేస్తారో వేచి చూడాలి.



