నార్త్ లో బాలయ్య అఖండ తాండవం.. అడ్వాన్స్ బుకింగ్స్ కు బాలీవుడ్ షాక్..!

బోయపాటి – బాలయ్య కాంబో అంటేనే ఫ్యాన్స్ కు మాస్ ఫెస్ట్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వీళ్ల కాంబోలో అలా సింహా, లెజెండ్, అఖండ వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక.. త్వరలో అఖండ 2 తాండవం అఖండ లాంటి సాలిడ్ హిట్‌కు సీక్వల్ గా ఈ సినిమా రూపొందింది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ డిసెంబర్ 4 (మరి కొద్ది గంటల్లోనే) గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక బాల‌య్య కెరీర్‌లో మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా కూడా ఇదే. ఈ క్రమంలోనే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనై.. తెలంగాణ, ఏపీ, ఓవర్సీస్ లో టికెట్లు హార్ట్ కేకుల అమ్మడుతున్నాయి.

Akhanda 2 Leads Ticket Sales Over Dhurandhar, Here's How Much The Movies  Have Earned In Advance Booking | Republic World

ఇలాంటి టైంలో మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం నెటింట‌ వైరల్ గా మారుతుంది. బాలయ్య పవర్ నార్త్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుందని.. బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అఖండ 2కి పోటీగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్ దురంధర్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాల బుకింగ్స్ విషయంలో స్ట్రాంగ్ పోటీ నెలకొందట. పలు నివేదికలు ప్రకారం ఇండియాలో ధురందర్‌.. 2డి మరియు ఐమాక్స్ 2డి హిందీ వర్షన్ లో తెలుగు రాష్ట్రాల‌లో 58,8001 టికెట్లు అమ్ముడు అయ్యాయని టాక్.

Akhanda 2 Faces Tough Hindi Clash with Dhurandhar

ఇక దురంధర్ ఫ్రీ సేల్స్ ద్వారా ఇప్పటివరకు రూ.2.58 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్‌. ఇక.. అఖండ 2 విషయానికి వస్తే.. ప్రీ సేల్స్‌తోనే భారీ లెవెల్‌లో అఖండ 2 దూసుకుపోతుంది. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా అఖండ 2కు.. 57 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే.. ఈ మూవీ తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయ‌గా.. ధురంథ‌ర్ కంటే కొంచెం తక్కువ బుకింగ్స్‌జరిగాయట. దీంతో.. అఖండకు నార్త్‌లోను ఎంత వేగంగా టికెట్ బుకింగ్స్ అవుతున్నాయో క్లారిటీ వచ్చేస్తుంది. అఖండ 2 ఇలానే కంటిన్యూ అయితే.. ఇవాళ రిలీజ్ అయ్యే ఓవర్సీస్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ దక్కించుకుంటే.. నార్త్‌లోను థురంధర్ కంటే భారీ కలెక్షన్లు కొల్లగొడతుంద‌ని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.