గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నటించినా.. అఖండ మాత్రం ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ.. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్యకు మంచి బూస్టప్ గా నిలిచింది. 2021 డిసెంబర్ 2న గ్రాండ్ లెవెల్ లో రిలీజై అఖండ విజయాన్ని దక్కించుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక.. తాజాగా ఈ సినిమా రిలీజై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన క్రమంలో.. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్.. లాభాల లెక్కలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. శివతత్వం, సామాజిక అంశాలు, రాజకీయ సంఘటనల ఆధారంగా రూపొందించిన అఖండ సినిమా.. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ లో రూపొందింది.
ఇక అప్పట్లో సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సైతం మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో.. థియేటర్‌లలో సినిమా చూడడానికి ఆడియన్స్ ఎగబడ్డారు. అయితే.. కరోనా లాక్‌డౌన్ తర్వాత సినిమా రిలీజ్ అయిన క్రమంలో.. ఏపీ సర్కార్ టికెట్ రేట్లు పెంచేందుకు నిరాకరించింది. అతి తక్కువ రేట్లతో సినిమా రిలీజ్ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం రికార్డులు కురిపించింది. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో.. నైజంలో రూ.10.5 కోట్లు, సీడెడ్ లో రూ.10.6 కోట్లు,ఉత్తరాంధ్రలో రూ.6 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రూ.4 కోట్లు, పశ్చిమగోదావరి రూ.3.5కోట్లు, గుంటూరు రూ.5.4 కోట్లు, కృష్ణ రూ.3.7 కోట్లు, నెల్లూరు రూ.1.8 కోట్లు మేరబిజినెస్ జరుపుకుంది. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.45.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.5 కోట్ల బిజినెస్ జరిగింది. అలా వరల్డ్ వైడ్‌గా రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా రిలీజై అఖండ సక్సెస్ అయిందని చెప్పాలి.
దాదాపు 60 రోజుల పాటు కంటిన్యూస్గా థియేటర్ లో ఆడిన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని టోటల్గా పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు థియేట్రికల్‌గా రూ.105 కోట్ల గ్రాస్, రూ.63.28 కోట్లు నెట్ కలెక్షన్స్ దక్కించుకొని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో అయితే రూ.5.2 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఓవర్సీస్ లో రూ.5.67 కోట్లు సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్, రూ.133 కోట్ల నెట్ వవసూళ్లు అఖండ సొంతమయ్యాయి. ఇలా ఫుల్ రన్ ముగిసేసరికి సినిమా ఏకంగా రూ.21 కోట్ల లాభాలను అఖండ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ అఖండ 2 తాండవం మరో రెండు రోజుల్లో.. డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో బాలయ్య ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో.. ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాడా చూడాలి.



