గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అఖండ తాండవం చూడాలని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన క్రమంలో.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికంటాయి. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. డిసెంబర్ 4 (నేడు) సాయంత్రం నుంచి గ్రాండ్ లెవెల్లో ప్రీమియర్స్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల.. ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ప్రారంభమై అన్నిచోట్ల హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక.. బోయపాటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో.. భారీ కాస్టింగ్ భాగమయ్యారు.
సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. భజరంగి భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్ర బాలయ్య కూతురి పాత్రలో మెరవనుంది. జగపతిబాబు, ఆది పిన్ని శెట్టి, పూర్ణ, సాయికుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో టీం రెమ్యూనరేషన్ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక సినిమా మొత్తం గా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు టీం. కాగా.. ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శీను ఎక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు సమాచారం.
సరైన నెంబర్ తెలియకపోయినా.. బాలయ్య రూ.25 నుంచి రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తే.. బోయపాటి కూడా రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ మొత్తం చేతికి అందిందట. అయితే ఫైనల్ గా మాత్రం బాలయ్య.. రెమ్యూనరేషన్తో పాటు.. సినిమాలో వచ్చే లాభాల్లో వాటా కూడా తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. పైగా ఈ సినిమాను బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్వి ప్రజెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బోయపాటి రెమ్యునరేషన్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి.



