గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ – బోయపాటి కాంబోలో రూపొందిన అఖండ 2 పై ఆడియోస్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు కొన్ని కారణాలతో సడన్గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే సస్పెన్స్ అందరిలో ను మొదలైంది. తాజాగా ఈ వివాదాన్ని క్లియర్ చేసిన మేకర్స్.. జనవరి 12న అంటే శుక్రవారం వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్‌కూడా వేయనున్నారు. దీనిపై తాజాగా మేకర్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమా టికెట్ ధరల విషయంలో ఎంతోమందిలో సందేహాలు ఉన్నాయి. డిసెంబర్ 5 రిలీజ్ టికెట్ రేట్ల పెంపుకే ఏపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో పాస్ చేసింది.

అయితే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మళ్లి టికెట్ హైక్ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో పాస్ చేసింది ఏపీ గవర్నమెంట్. పది రోజులు సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునే అవకాశాలు ఏపీ గవర్నమెంట్ కల్పించింది. ఇక డిసెంబర్ 11 గురువారం రాత్రి 9 గంటలకు ప్రీవియస్ పడేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారట. మరికొన్ని గంటల్లో ఏపీ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. ఇక నైజంలో కూడా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణా గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుందో.. లేదో.. చూడాలి.

