బాలకృష్ణ – బోయపాటి లేటెస్ట్ మూవీ అఖండ 2 వాస్తవానికి డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కావలసి ఉండగా.. పైనాన్స్ ఇష్యూలతో మూవీ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై అందరిలో సస్పెన్స్.. అసలు ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేస్తారా.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారా.. లేదా మరింత ఆలస్యం అవుతుందా.. అనే ప్రశ్నలు వెల్లువయ్యాయి. అయితే అటు అభిమానుల నుంచి బయర్లు, డిస్ట్రిబ్యూటర్ల వరకు డిసెంబర్ 12న రిలీజ్ చేయడం సరైన సమయం అని.. ఇప్పుడు సినిమాకు మరింత హూప్ పెరిగింది.. ఈ టైంలోనే సినిమా రిలీజ్ చేస్తే మంచి సక్సెస్ అవుతుందని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా డిసెంబర్ 12 రిలీజ్ చేసేందుకు మగ్గు చూపారు.

ఫైనాన్స్ సమస్యలను క్లియర్ చేసుకొని.. కోర్టులో సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం డిసెంబర్ 12 సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమైంది. అంతేకాదు డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియర్ షోస్ కూడా పడనున్నాయి. దీని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలోనే.. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఎఫెక్ట్ చిన్న సినిమాలపై భారీగా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏకంగా 14 కొత్త సినిమాలు.. 3 రీ రిలీజ్ సినిమాలు అదే టైంలో ఉన్నాయి. కొత్త సినిమాల్లో రోషన్ కనకాల – మొగ్లీతో పాటు, తమిళ్ హీరో కార్తీ – అన్నగారు వస్తారు, అలాగే డ్రైవ్ లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అఖండ 2 డిసెంబర్ 12న రిలీజ్ చేయడంతో.. ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి డైలమాలో పడిపోయింది. అసలు డిసెంబర్ 12న బాలయ్య సినిమాతో పాటు.. ఈ సినిమాలు రిలీజ్ అయినా వీటి పెద్దగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో చాలా సినిమాలు డిసెంబర్ 12న రిలీజ్ వాయిదా వేసుకుంటూన్నాయట. ఇప్పటికే మోగ్లి సినిమాలు వాయిదా వేసినట్లు తాజాగా ఆ మూవీ డైరెక్టర్ చేసిన పోస్ట్‌తో క్లారిటీ వచ్చేసింది. నిజంగా బాలయ్య అఖండ 2 కొత్త రిలజ్ డేట్.. ఈ చిన్న సినిమాలన్నింటికీ బిగ్ స్ట్రోక్ గా మారింది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

