బాలయ్య అఖండ 2 సినిమా డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదే ప్రీమియర్ షోలతో పాటు.. చాలామంది సినిమాను 2d ఫార్మాట్లోను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే.. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే.. ఓ విషయంలో మాత్రం అఖండ 2 హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అదే 3d వర్షన్.. 3d లో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మరోలా ఉంది. నిన్న ఉదయం నుంచి చాలా చోట్ల 3d వర్షన్ లోను సినిమాలో రిలీజ్ చేశారు. ఇక 3d వర్షన్ సినిమాను చూసిన ఆడియన్స్ అంతా సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయని.. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ ఎఫెక్ట్స్ 3d లో అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2dలో చూసినప్పుడు చాలా నార్మల్‌గా అనిపించిన ఫైట్స్ 3dలో మాత్రం ఆ డెప్త్ కారణంగా ఎఫెక్టివ్ గా కనిపించాయని.. మన తెలుగు సినిమాల్లో 3d టెక్నాలజీ ఇప్పటివరకు పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ.. అఖండ విషయంలో మాత్రం ఇది కచ్చితంగా పని చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 3d ఎఫెక్ట్స్ బాలయ్య రుద్ర తాండవానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని.. ముఖ్యంగా ఆంజనేయ స్వామి పూనకం వచ్చినట్లు బాలయ్య గధ పట్టుకుని విశ్వరూపం చూపించే సీన్స్ ఐతే 2d కంటే 3dలో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయని.. ఆ గథ మనపైకి వస్తుందా అన్నట్లుగా ఉందని.. ఆంజనేయ స్వామి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు తగులుతాయి అని మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాలో ఆది పినిశెట్టి తాంత్రికుడిగా ఎంత బలమైన పాత్రలో చేశారో తెలిసిందే. ఈ క్యారెక్టర్ చుట్టూ దెయ్యాలు, భూతాలు తిరిగే సన్నివేశాలు 2dలో చూస్తే మామూలుగా ఉన్న 3d ఎఫెక్ట్స్‌లో మాత్రం వణుకు పుట్టించేలా ఉన్నాయని.. సినిమా కథతో సంబంధం లేకుండా విజువల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకైనా ఆడియన్స్ కచ్చితంగా ఇష్టపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు 3d ఎఫెక్ట్‌ను ఇష్టపడే వాళ్లకు సినిమా చాలా నచ్చేస్తుందట. తెలుగులో 3d ఎఫెక్ట్‌ను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని ఆడియన్స్ కు ఇది బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక 2d, 3d రెండు భాషల్లో సినిమా చూసిన ఆడియన్స్ చాలామంది.. 2d తో కంపేర్ చేస్తే 3d యాక్షన్ ఎఫెక్ట్స్ కానీ, ఆడియో గాని చాలా బాగున్నాయని.. కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా మూవీ టాక్ పక్కన పెడితే 3d ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయిందట.



