తాజాగా అఖండ 2 సక్సెస్ మీట్‌లో థమన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో.. అసలు యూనిటీ లేదని ఎవరికి వాళ్లే అన్నట్లు ఉంటున్నారని.. ఆయన చెప్పుకొచ్చాడు. అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో.. మూవీ రిలీజ్ కాంట్రవర్సీ పై ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇక డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వారం ఆలస్యమై డిసెంబర్ 12న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే థమన్ రియాక్ట్ అవుతూ.. వాళ్ళు అనుకుంటే ముందే కేసు వేయవచ్చని.. కానీ లాస్ట్ మినిట్ లో కేసు వేసి ఆపేసారని థమన్ చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలోని యూనిట్ లేదు. మన అనే స్ట్రాంగ్ నెస్ ఎవరి మధ్యన కనిపించడం లేదు. ఇది మనది అనుకుంటేనే అందరం బాగుంటాం. ఛాన్స్ దొరికితే సలహాలు ఇస్తారు తప్ప.. ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి మాట్లాడితే ప్రొడ్యూసర్స్‌కు మంచి బలం వస్తుంది. ప్రొడ్యూసర్స్ ముందు మంచిగా మాట్లాడి బయటికి ఎందుకు తప్పుగా చెబుతున్నారు.. అందరూ కలిసి కష్టపడితేనే సినిమా సక్సెస్ అవుతుంది అంటూ థమన్ కామెంట్స్ చేశాడు. మన తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పదని.. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ పవర్ మరి ఎక్కడ ఉండదని.. ఈ క్రమంలోనే టాలీవుడ్ అంటే మిగిలిన వాళ్లకు ఈర్ష అంటూ చెప్పుకొచ్చాడు.
మన ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.. యూట్యూబ్ తెరిస్తే ఒకరినొకరు తిట్టుకోవడం.. చాలా నెగెటివిటీగా మారింది. మనందరికీ ఒక యూనిటీ ఉండాలి. ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకుంటే ఇంకెవరు చేస్తారు.. అందరం కలిసి పని చేద్దాం అని ఫీల్ అవ్వాల్సిన టైం వచ్చింది. దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండి గాని.. బ్యాండ్ వాయించకండి అది చాలా తప్పు.. ప్రొడ్యూసర్స్ గెలవాలి అనుకున్న సినిమాను లాస్ట్ మినిట్ లో ఎందుకు ఆపాలి.. రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ అనగా.. 7 గంటలకు సినిమా ఆగిపోయిందని ప్రొడ్యూసర్ ట్విట్ వేసే కర్మ ఏంటి.. వాళ్ళు ఎంత కుమిలిపోతారు.. వాళ్ల గురించి ఎవరు ఆలోచించరా.. వాళ్లకు కుటుంబం ఉంటుంది.
తప్పుగా ఒక మాట అనేస్తారు. ఎవరు తప్పు చేయరు.. ఏ విషయమైనా అందరూ ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా సినిమా ఎప్పుడు వచ్చినా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం. బాక్సులు బద్దలై స్పీకర్లు పేలిపోతాయి అని మాకు తెలుసు. ఈ సినిమాను అందరూ ఇంత సక్సెస్ చేసినందుకు.. చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే అఖండ 2 తాండవాన్ని రాజధాని ఢిల్లీలో స్పెషల్ షోతో ఏర్పాటు చేయనున్నట్లు బోయపాటి వెల్లడించాడు. ప్రధాని మోడీని చూడబోతున్నారని క్లారిటీ ఇచ్చాడు. సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో సినిమా తెరకెక్కిందని ఆయన తెలుసుకున్నారని గొప్ప సినిమాని సపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారని వివరించాడు.



