2025.. హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..!

ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు ఆడియ‌న్స్‌ను పలకరిస్తాయి. అయితే.. వాటిలో కొన్ని మాత్రమే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ వైవిధ్యమైన రిసల్ట్ ను అందుకుంటాయి. అలా.. 2025 లో కూడా ఎన్నో వందల సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. ఇక వాటిలో ఇండస్ట్రీల వారిగా హైయెస్ట్ వసూళ్లు రాబ‌ట్టిన టాప్ 5 సినిమాల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఏడాది కూడా ఇండియన్ సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువగానే ఉంది. కానీ.. ఈ ఐదు సినిమాలు వెంటిలేటర్ పై ఉన్న సినీ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పాలి. మరి ఇంతకీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో టాప్ గ్రాస‌ర్లుగా నిలిచిన ఆ టాప్ 5 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఓజి:
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి భారీ అంచనాలతో రిలీజ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే మంచి రిజల్ట్ అందుకుంది. బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసి.. పవన్ కెరియర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ లో రాబట్టింది. ఫుల్ ర‌న్‌లో రూ.316 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి 2025 లో ఆల్ టైం టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ను దక్కించుకుంది.

కూలి:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ కూలీ. రిలీజ్ కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పినా.. రిలీజ్ తర్వాత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయినా.. కలెక్షన్ల పరంగా కోలీవుడ్లో 2025 టాప్ గ్రాసర్‌గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.510 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

Kantara Chapter 1 Box Office Collection Day 5: Rishab Shetty Starrer  Outperforms Allu Arjun's Pushpa 2

ఛావా:
చత్రపతి శంబాజీ మహారాజ్ బయోపిక్ గా ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా దాదాపు రూ.820 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది.

కాంతారా 2:
కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ఈ సినిమా వ‌చ్చి్వి. ఈ క్రమంలోనే సినిమాపై మొదటి నుంచి అన్ని భాషల ఆడియన్స్ లోను మంచి హైప్‌ మొదలైంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. అన్ని భాషల్లోనూ కలిపి రూ.800 కోట్లకు పైగా గ్రాస్ ద‌క్కింది. అంతే కాదు 2025లో మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కాంతార 2 కారణంగా.. శాండిల్ వుడ్ టాప్ గ్రాఫర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Lokah Chapter One: Chandra (2025) - IMDb

లోక:
కళ్యాణి ప్రియదర్శి ప్రధాని పాత్రలో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లోకా. ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ త‌ర్వాత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల‌ను కల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా.. 2025లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవ‌డమే కాదు.. బాలీవుడ్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది.