బర్త్ డే స్పెషల్: స్టైలిష్ లుక్ లో వెంకీ మామ.. మన శంకర వరప్రసాద్ గారు సర్ప్రైజ్ అదుర్స్..!

ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే చాలు స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ కంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అయితే.. కేవలం ఫ్యాన్స్‌ కాదు.. యాంటీ ఫ్యాన్స్ కూడా మొదలైపోతారు. కానీ.. ఇండస్ట్రీలో ఎలాంటి నెగెటివిటీ లేకుండా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. యాంటి ఫ్యాన్స్ లేకుండా కొనసాగడం అంటే అది తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యం. అలాంటి వారిలో కచ్చితంగా విక్టరీ వెంకటేష్ పేరు వినిపిస్తుంది.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు.. ప్రతి ఒక్కరూ వెంకటేష్ సినిమాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వెంకటేష్ ని ముద్దుగా వెంకీ మామ అని ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వెంకీ మామ బర్త్డే ఈరోజు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు విష‌స్ వెల్్లువెత్తుతున్నాయి. ఇక వెంకటేష్ ప్ర‌స్తుతం కీలకపాత్రలో నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. చిరు హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి వెంకీ స్టైలిష్ లుక్ ను రివిల్ చేశారు. అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో వెంకటేష్ బర్త్డే సర్ప్రైజ్ ను ప్లాన్ చేసాడు.

ఈ సినిమా నుంచి వెంకీ లుక్ ను రిలీజ్ చేస్తూ ఓ వీడియోతో.. పోస్టర్ను కూడా పంచుకున్నాడు. ఈ పోస్టర్లో వెంకీ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుంది. వెనుక బ్లాక్ డ్రెస్ లో గన్స్ పట్టుకుని బాడీగార్డ్స్ వస్తుంటే స్టైల్ గా వెంకీ నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి ప్రమోషన్ అంటేనే డిఫరెంట్ లెవెల్. ఈ క్రమంలోనే చుట్టూ ఆర్టిస్టులు ఉండగా మధ్యలో కొరియోగ్రాఫర్ సందీప్ తో కలిసి అని నిలబడి ఉన్నాడు. ఎనీ టైం.. ఎనీ సెంటర్.. సింగల్ హ్యాండ్.. హ్యాపీ బర్త్డే టూ యు విక్టరీ వెంకటేష్ గారు అంటూ వెంకీ లుక్స్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది ప్ర‌జెంట్‌ తెగ వైరల్ గా మారిపోతుంది. వెంకటేష్‌ను చూసిన‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో మీరు ఓ లుక్కేసేయండి.