టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన రాజాసాబ్ ఓటీటీ హక్కులపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మొదట నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మధ్య గట్టి కాంపిటేషన్ ఉన్నా.. జియో హార్ట్ స్టార్ తెలివిగా ఈ హక్కులను చేజాక్కించుకోవడం విశేషం. పాన్ ఇండియా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.170 కోట్లకు పైగా చెల్లించి మరి జియో హాట్స్టార్ సొంతం చేసుకుందట.

2026 సంక్రాంతి బరిలో సినిమా.. గ్రాండ్ రిలీజ్ తర్వాత.. జియోలో స్ట్రీమ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందినది రాజాసాబ్ సినిమా ఓటీటీ హక్కుల కోసం గట్టి పోటీ మొదలైంది. అయితే.. అందరి అంచనాలను రివర్స్ చేస్తూ జియో హాట్స్టార్ ఈ హక్కులను తన సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల్లో హాట్స్టార్లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.
![]()
హారర్ కామెడీ.. ఎంటర్టైలర్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాల్లో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్గా మెరిసారు. థమన్ మ్యూజిక్ అందించాడు. వచ్చే ఏడాతి సంక్రాంతి బరిలో గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాను.. పండగ హడావిడిలో ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోయినా.. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు.

