టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యట్రిక్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం చివరి నిమిషంలో రిలీజ్‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్ని భాషల్లోను గ్రాండ్‌గా రిలీజ్ కావలసి ఉండగా.. నిర్మాతలకు ఉన్న ఫైనాన్స్ సమస్యలతో.. కోర్ట్ ఈ సినిమా రిలీజ్ ను ఆపేసింది. ఓ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలై.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో టికెట్లు బుకైపోయిన తర్వాత రిలీజ్‌కు కొద్దిగా గంటల ముందు సినిమా ఆగిపోవడం ఇటీవల కాలంలో జరగలేదు. అది కూడా.. ఇలాంటి ఘటన బాలయ్య కెరీర్లో మొదటిసారి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో ఫైనాన్షియల్ సమస్యలన్నీ తీరిపోయి.. సినిమా రేపోమాపో రిలీజ్ అవుతుందిలే అది భావించినా.. ఫ్యాన్స్‌లో కూడా ఇప్పుడు నిరాశ తప్పదట.
ఇప్పట్లో.. సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. కారణం.. ఈరోస్‌కు ఇవ్వాల్సిన రూ.60 కోట్లు కాదు.. గతంలో పాత సినిమాలు ఇచ్చిన వాళ్లు కూడా తమ డబ్బు తమకు ఇచ్చేంతవరకు సినిమాలు రిలీజ్ చేయకూడదు.. అంటూ కొర్ట్ మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారట. మొదటి సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది అని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు డిసెంబర్ 25 కు కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదని.. సినిమా చూడాలంటే సంక్రాంతి వరకు ఆగల్సిందే అంటున్నారు. అయితే.. ఇప్పటికే సంక్రాంతి బరిలో 5 సినిమాలు బుక్ అయిపోయాయి.
చిరంజీవి – మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ – రాజాసాబ్, శర్వానంద్ – నారి నారి నడుమ మురారి, రవితేజ – భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి – అనగనగా ఒక రాజు ఇలా సినిమాలని వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు ఫెస్టివల్ సీజన్లో థియేటర్లు సర్దుబాటు చేయడానికి బయ్యర్స్ కు కష్టతరమైపోయింది. అలాంటిది.. ఇప్పుడు అఖండ 2 థియేటర్స్‌లోకి రావడం అంటే అది మరింత కష్టమైపోతుందని.. ఈ క్రమంలోనే అఖండ 2 రిలీజ్ అయితే.. డిసెంబర్ 25న లేదా.. అంతకంటే ముందు రిలీజ్ కావాలి.. లేకపోతే ఫెస్టివల్ బరిలో తప్పించి తర్వాత మంచి డేటు ఫిక్స్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే అఖండ 2 ఇప్పట్లో రిలీజ్ కష్టమేనంటూ విశ్లేషకులు చెప్తున్నారు.



