” శివ ” మూవీలో స్టోరీ ఎక్కడుంది.. నేను అందుకే నటించలేదు.. తనికెళ్ల భరణి

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున శివ‌ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌య్యింది. అప్పట్లో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా నుంచి ఆ సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. కానీ.. సందీప్ వంగను మించిపోయేలా అప్పట్లోనే.. ఆర్జీవి తన టేకింగ్‌తో ఆడియన్స్‌లో పూనకాలు తెప్పించాడు. అసలు ఇలాంటి సినిమాలు తీసే ఆలోచనలు వర్మకు ఎలా వస్తాయి అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యేవి. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగార్జున.. అసలు ఈ సినిమాకు ఎలా ఒప్పుకున్నాడు.. అనేది ఇప్పటికీ బిగ్ మిస్టరీ. అయితే.. ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వ్యవహరించాడు.

Shiva (1989) - IMDb

కాగా.. శివ సినిమా ఎక్స్పీరియన్స్‌లను షేర్ చేసుకుంటూ.. తాజాగా తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. వర్మ నాకు శివ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్, సంఘటనలను ఎక్స్ప్లైన్ చేసి పూర్తిస్థాయి స్క్రిప్ట్ రాయ‌మ‌న్నాడు. ఆ టైంలో ఆర్జీవికి అసిస్టెంట్ డైరెక్టర్గా కృష్ణవంశీ పని చేస్తున్నాడు. నేను రాసిన స్క్రిప్ట్ చదివి ఆయన పగలబడి నవ్వాడు. ఆ తర్వాత ఇదే స్క్రిప్ ని ఆర్జీవికి ఇస్తే ఇదేంటి స్క్రిప్ట్‌లో ఇన్ని జోకులు రాశారు అని అడిగాడు.. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా కదా అందుకు ఇవి ఖచ్చితంగా ఉండాలన్నా. అప్పుడు.. వర్మ సినిమాలో ఒక్కటంటే ఒక్క జోక్ కూడా ఉండడానికి కుదరదు అన్నాడని త‌నికెళ్ళ వివ‌రించాడు.

అప్పుడు నేను మనసులో ఆహా ఇక ఈ సినిమా ఆడినట్లే అనుకున్నానని.. నాకే కాదు యూనిట్ మొత్తానికి వర్మ ఆ మాట అనడంతో షాక్ గా అనిపించిందని.. సినిమా ఆడుతుందని నమ్మకం పోయిందంటూ చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్‌ విషయం వర్మ చెప్పిన మార్పులు చేయడం నావల్ల కాలేదు.. ఏదో ప్రయత్నం చేశా కానీ.. అది నచ్చుతుందో.. లేదో.. కూడా తెలియదు. ఆ అసంతృప్తితోనే.. స్క్రిప్ట్ నేను నేరుగా వర్మకు ఇవ్వలేక.. నా మిత్రుడు సీయల్ నరసింహారావు చేతికి ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇచ్చేయమన్నా. తర్వాత వర్మ నుంచి నాకు ఫోన్ రాలేదు.. స్క్రిప్ట్ అతనికి నచ్చిందని అనుకున్నా. కానీ.. ఈ లోపు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అందులో నా పేరు లేదు. నేను వెంటనే కో డైరెక్టర్ నాగేశ్వరరావుకు ఫోన్ చేశా. సినిమా ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని అడిగాడు.

Tanikella Bharani Exploring Shiva After 25 Years || The Goon Of Shiva

అప్పుడు.. నేను జరిగిందంతా చెప్పా. ఆర్జీవి ఎందుకో నీ మీద అలిగాడు అనుకుంటా.. అన్నాడు. తర్వాత నేను స్వయంగా ఆర్జీవికి కాల్ చేసా. అప్పుడు ఆయన మాట్లాడుతూ భ‌ర‌ణి ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశావ్‌.. శివ కాస్ట్యూమ్స్ కోసం చెన్నైకి వచ్చా.. మీ ఇంటికి వస్తా అన్నాడు. సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చాడని వివరించాడు. ఇక ఆర్జీవి భరణితో మాట్లాడుతూ నేను.. నిన్ను స్క్రిప్ట్ నుంచి తీసేయడానికి కారణం ఏంటో తెలుసా.. ఓ సినిమాకు స్క్రిప్ట్ దేవుడిలాగా.. దాన్ని నువ్వు వేరే వాళ్ళతో ఇచ్చి పంపావు. అది చాలా పెద్ద మిస్టేక్ అన్నాడని వివరించాడు. ఇక.. ఆర్జీవితో.. అసలు ఇందులో స్టోరీ ఎక్కడుందని అడిగానని.. అలా మా ఇద్దరి మధ్యన సరదా కాన్వర్జేషన్ జరిగిందంటూ వివరించాడు. ఇక.. ఈ సినిమా తర్వాత.. ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే అంటూ తనికెళ్ళ భరణి వివరించాడు. ప్రస్తుతం తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.