టాలీవుడ్ నేషనల్ క్రిష్ రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్యన ప్రేమాయణం నడుస్తుందంటూ.. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వీళ్ళ ఇద్దరికి సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అంటూ ఊహగానాలు వినిపించాయి. అయితే.. ప్రస్తుతం వీళ్ళిద్దరికీ సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నారంటూ టాక్ బయటకు వచ్చింది.
అయితే.. వీళ్ళ పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ చేసుకోబోతున్నారని దానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. కేవలం అభిమానులే కాదు.. సినీ ఇండస్ట్రీలో సైతం వీళ్లిద్దరి పెళ్లి విషయంలో ఆసక్తి చూపుతుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎంగేజ్మెంట్ సింపుల్‌గా.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా గుట్టుగా జరిగిందంట. అగష్ట్ 3 శుక్రవారం ఈ జంట రింగ్స్ మార్చుకున్నట్లు తెలుస్తుంది.

అయితే.. ఈ జంట ఆఫీషియల్ గా దీన్ని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన అప్డేట్ వైరల్ అవుతుంది. రష్మిక, విజయ్ దేవరకొండ.. 2026 ఫిబ్రవరి 26న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారని.. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీళ్ళిద్దరి పెళ్లి జరగబోతుంది అంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఈ వార్తలపై అటు విజయ్ కానీ.. ఇటు రష్మిక గాని ఎవ్వరూ స్పందించలేదు. కనీసం ఖండించలేదు. ఈ క్రమంలోనే.. అభిమానులు కూడా ఈ వార్తలు వాస్తవబని తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి పెళ్లి డేట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

