టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వారణాసి. తాజాగా.. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసి ఆడియన్స్‌తో పంచాడు జక్కన్న. ఈ గ్లింప్స్‌లో ఎన్నో సస్పెన్స్‌లను ఉంచి.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించాడు. చిన్న గ్లింప్స్ వీడియోతోనే ఎంతో అర్ధాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే.. ఆడియన్స్ కు రాజమౌళి ఏదో కొత్త కథతో.. మరోసారి మన ముందుకు రాబోతుందని ఫీల్ కలిగింది. ఇక రుద్ర పాత్రలో మహేష్, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారాన్, మందాకిని రోల్ లో హీరోయిన్గా ప్రియాంక చోప్రాను రంగంలోకి దించేశారు. వీళ్ళ లుక్స్ రివిల్ చేశాడు. ఇక ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో.. అన్ని భాషల నటినటులను కవర్ చేయాలని జక్కన ప్లాన్ చేశాడట. అందులో భాగంగానే.. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మహేష్, బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, మల్లీవుడ్ నుంచి పృధ్వీరాజ్ సుకుమారన్‌లను రివిల్ చేశాడు. అయితే మరో ఇండస్ట్రీ నుంచి ఇంకో స్టార్ హీరో కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యాడని.. సినిమాలో హనుమంతుడు పాత్రలో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ హీరో నటించనున్నాడు అంటూ టాక్ వైరల్ అవుతుంది. అతను మరెవరో కాదు సుదీప్ కిచ్చ. వారణాసిలో కన్నడ ఇండస్ట్రీ నుంచి సుదీప్ ఎంట్రీ ఇవ్వబోతున్నడట. ఈ సినిమా కోసం హనుమంతుడు రోల్లో సుదీప్‌ను రాజమౌళి సెలెక్ట్ చేశాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.

దీంతో.. అందరూ హీరోలను అన్ని ఇండస్ట్రీలో నుంచి కవర్ చేస్తూ రాజమౌళి సినిమా ప్లాన్ చేశాడని అర్థం అయిపోయింది. ఈ క్రమంలోనే.. సుదీప్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. మా స్టార్ హీరోను హనుమంతుడు పాత్రలో సెలెక్ట్ చేయడం ఏంటి.. సినిమాలో ఎన్నో కీలక పాతలుఉంటే.. ఇంపార్టెంట్ పాత్రలను మిగతా స్టార్ హీరోలకి ఇచ్చి.. మా హీరోకు మాత్రం హనుమంతుడి రోల్ ఎందుకు ఇచ్చారు.. రోల్స్పేస్ ఎక్కువే ఉంటే ఓకే కానీ.. ఏదో ఒక రెండు మూడు సీల కోసం హనుమంతుడి రోల్ లో మా హీరోను చూపించి వదిలేస్తే అస్సలు బాగోదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. నిజంగానే కిచ్చా సుదీప్.. వారణాసిలో.. హనుమంతుడి రోల్లో నటించాడా.. లేదా.. తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.


