నందమూరి నట సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్లు అందుకొని మంచి జోష్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలను లైన్లో ఉంచుతున్నాడు బాలయ్య. ఇక బోయపాటి శీను – బాలయ్య కాంబోలో రూపొందిన అఖండ 2.. మరో రెండు వారాల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్లో NBK 111 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలైపోయాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను బాలయ్య నేషనల్ స్టేజ్‌పై అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.
ఈ సినిమాలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటించనున్నాడని వెల్లడించాడు. ఇది నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా కిక్ ఎక్కించే అప్డేట్ అనడంలో సందేహం లేదు. గోవా వేదిక తాజాగా 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గ్రాండ్ లెవల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈవెంట్లో బాలేకున్న సత్కారం జరిగింది, తర్వాత బాలయ్య పలు మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే బాలయ్య ఆదిత్య 999 మ్యాక్స్ మూవీ త్వరలో చేయబోతున్నానని.. ఇందులో కొడుకు మోక్షజ్ఞతో కలిసి నటిస్తాన్నంటూ వెల్లడించాడు.

ఇక ఈ సినిమా 1991లో సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందిన టైమ్ ట్రావెల్ మూవీ అదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా రూపొందించనున్నారు. ఇక ఆదిత్య 369 ఇండియన్ హిస్టరీ లోనే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది. ఆడియన్స్ మదిలో చిర స్థాయిగా నిలిచిపోయింది. అలాంటి సినిమాకు సీక్వల్గా ఆదిత్య 999 తెరకెక్కనున్న క్రమంలో అది కూడా మోక్షజ్ఞ భాగం కానుడాని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కావడంతో.. ఈ కథను ఎలా చూపించబోతున్నారని ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
