టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 1999లో స్వయంవరం సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైన వేణు.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక.. ఇదే సినిమాతో లయ కూడా హీరోయిన్ ప్రారంభించింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన వేణు సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకున్నాడు. మనసుపడ్డాను కానీ నుంచి చెప్పవే చిరుగాలి వరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. కాగా.. మొదటి సోలో హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న వేణు.. కొంతకాలం తర్వాత సెకండ్ హీరో గాను నటించాడు.
ప్రస్తుతం విలన్ పాత్రలో చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. చివరిగా మాస్ మహారాజు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీలో నెగిటివ్ రోల్లో కనిపించాడు వేణు. అయితే.. గత కొంతకాలంగా ఆయన సినిమాలను తగ్గించేసిన సంగతి తెలిసిందే. గతంలో.. వేణుకంటూ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకునేది. ఇక ప్రస్తుతం.. వేణుకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. ఒక స్టార్ హీరో వల్ల తాను రూ.14 లక్షలు నష్టపోయానంటూ స్వయంగా వేణు ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు.
ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఇప్పటికీ.. టాలీవుడ్ లో కీలక పాత్రలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న జగపతిబాబు. గతంలో వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగపతిబాబు నేను చాలా క్లోజ్ పర్సన్స్. ఆయనతో నేను హనుమాన్ జంక్షన్, ఖుషి, ఖుషీగా సినిమాల్లో చేశా. హనుమాన్ జంక్షన్ చేసిన తర్వాత.. ఇమేజ్ అంతా నువ్వే కొట్టేసావని సరదాగా అనేవారు. తనకు నాకు మంచి రిలేషన్ ఏ ఉంది. నాకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు ఉండవు. కానీ.. ఓ సంఘటన కారణంగా మా ఇద్దరి మధ్యన అనుకోకుండా దూరం ఏర్పడింది అంటూ వివరించాడు. ఓ వ్యక్తికి జగపతి బాబు వల్ల రూ.14 లక్షలు అప్పు ఇచ్చా.. ఆ డబ్బు నాకు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఓ పర్సన్ నా దగ్గరకు డబ్బు అవసరమని వచ్చారు. రూ.14 లక్షలు కావాలని అడిగాడు. దానికి జగపతిబాబు మధ్యలో ఎంట్రీ ఇచ్చి హామీ ఇచ్చాడు. ఆయన హామీ ఇచ్చారని నమ్మకంతో నేను అతనికి రూ.14 లక్షలు ఇచ్చా. కానీ.. అతను తిరిగి డబ్బు ఇవ్వలేదు. అప్పట్లో నాకు అది చాలా బిగ్ అమౌంట్. ఇక జగపతిబాబు కూడా తర్వాత నన్ను ఆ డబ్బు ముట్టిందా అని ఎప్పుడు అడగలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇది జరిగి కూడా చాలా కాలమే అయిపోయిందంటూ వివరించాడు. ఆ తర్వాత నేను కూడా జగపతిబాబు గారిని ఇప్పటివరకు కలవలేదు, మాట్లాడలేదు అంటూ వివరించాడు. దాని గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు. గతంలో వేణు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.



