‘ వారణాసి ‘ లో మొత్తం ఆరు పాటలు.. నాపై ఎలాంటి స్ట్రెస్ లేదు.. కీరవాణి

టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ వారణాసి పై ఇప్పటికే ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌లో రాజమౌళి సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్య‌వ‌హరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సినిమా సౌండ్ ట్రాక్ గురించి కీరవాణి ఓ సందర్భంలో రియాక్ట్ అయ్యాడు.

అభిమానులు ఈ సినిమాల్లో గొప్ప మ్యూజిక్ ఆశించొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సందడి చేసిన కీరవాణి.. పిటిఐతో మాట్లాడుతూ అభిమానులు వారణాసి నుంచి అద్భుతమైన గొప్పదనాన్ని ఆశించవచ్చు. అంతకుమించి.. నేనేమీ చెప్పకూడదు. వారణాసి సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా మ్యూజిక్ జర్నీ గురించి మాట్లాడుతూ.. నాపై ఎలాంటి బర్డెన్‌ లేదని వివరించాడు.

మీరు చేసే ఏ పని అయ్యినా.. అది సినిమా ప్రాజెక్ట్ అవ్వచ్చు.. లేదా ఇంకేదైనా స్పష్టత, నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెస్ ఉండదని.. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటేనే స్ట్రెస్‌కు లోన్ అవుతాం. నా విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక కీరవాణి.. రాజమౌళితో కలిసి గతంలో స్టూడెంట్ నెంబర్ 1, మగధీర, ఈగ ,బాహుబలి ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేశాడు. అంతే కాదు.. ఆర్ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు కీరవాణి ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక.. కీరవాణి మ్యూజిక్ పై చేసిన ఈ కామెంట్స్‌తో సినిమాపై హైప్‌ మరింతగా పెంచేసాడు.