సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ ఆమె పాత్రకు కనెక్ట్ అవుతూ ఉండడంతో.. పాజిటివ్ రివ్యూస్‌తో మాటు.. డైరెక్టర్ల పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే.. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ రివ్యూలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

అంతలా ఈ సినిమా ప్రభావం ఆడియన్స్‌పై కనిపిస్తుంది. నవంబర్ 7న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై.. పాజిటివ్ టాక్ తో రాణిస్తున్న ఈ సినిమాలో.. రష్మిక జంటగా దీక్షిత్ శెట్టి మెరశారు. ఇక.. వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని.. అతని పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ తో దీక్షిత్ శెట్టి పేరు కూడా తెగ మారుమోగిపోతుంది. సూపర్ హిట్ టాక్ తో రాణిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు దీక్షిత్ శెట్టి కంటే ముందు ఒక టాలీవుడ్ హీరోను భావించారట మేకర్స్.

విక్రమ్ పాత్ర కోసం డైరెక్టర్ రాహుల్.. తెలుగు హీరో నాగశౌర్యను అప్రోచ్ అయ్యాడట. అతనికి కథ నచ్చినా.. చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండడంతో.. ది గర్ల్ ఫ్రెండ్ ను వదులుకున్నాడట. దీంతో దీక్షిత్‌తో రాహుల్ ఈ సినిమాకు ఓకే చెప్పించాడు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. ప్రశంసలు అందుకుంటున్నాడు దీక్షిత్. ఈ క్రమంలోనే న్యూస్ తెగ వైరల్ గా మారడంతో.. నాగశౌర్య ఇటీవల కాలంలో ఒక్క సరైన సక్సెస్ కూడా కొట్టలేదు. అలాంటిది.. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మంచి కంటెంట్ మిస్ చేసుకోకుండా ఉండుంటే బాగుండేదని. అన్‌లక్కీ ఫెలో అంటూ.. మంచి ఛాన్స్ ను వద్దులుకున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

