ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకంటూ ఓ ప్రత్యేకమైన స్టేజ్ ఉండేది కాదు. తమిళనాడులోని మద్రాస్‌లో తమిళ్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ కూడా బాగానే ఉండేది. అప్పుడు మనకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలని కష్టపడి నాగేశ్వరరావు టాలీవుడ్‌ను క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి తెలుగు సినిమాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. అయినా భారతదేశంలో తమ ఇండస్ట్రీని టచ్ చేసే తోపు ఇండస్ట్రీ మరొకటి లేదంటూ తమిళ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ రెచ్చిపోయేవి. అలాంటిది.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లోనే టాలీవుడ్ నెంబర్‌వన్ పొజిషన్‌కు చేరడానికి ప్రధాన కారణం రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఇక.. ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ వేదికపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరిగింది. అలాంటి రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కేవలం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న.
ఈ క్రమంలోనే సినిమా షూట్ చాలా సీక్రెట్ గా పగడ్బందీ ప్లాన్ తో కంటిన్యూ చేస్తున్నాడు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 15న సినిమాపై అదిరిపోయే అప్డేట్స్ రానున్నాయని రాజమౌళి అఫీషియల్ గా ప్రకటించాడు. అంతేకాదు.. ఈ ఈవెంట్‌పై తనదైన స్టైల్‌లో ప్రమోట్ చేస్తూ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాడు రామోజీ. హైదరాబాద్.. రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నిర్వహించనున్న ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సిద్ధం చేసేసారట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ను అప్పటిదాకా ఎంగేజ్ చేస్తూ సినిమాపై హైప్‌ను కంటిన్యూ చేయడం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ లుక్‌ను తాజాగా జక్కన్న రివీల్ చేశాడు. ఈ మూవీలో పృథ్వీరాజ్ కుంభ అనే పాత్రలో మరువనున్నట్లు షేర్ చేసుకున్నాడు.
ఆ పోస్టర్‌లో హ్యాండీక్యాప్డ్ వ్యక్తిలా పృథ్వీరాజ్ కనిపించారు. పృథ్వీరాజ్ వీల్ చైర్ కి పరిమితమైనట్లు చూపించారు. దానిమీద చాలా విమర్శలు తలెత్తుతున్నాయి. క్రిష్టి సూర్య హీరోగా నటించిన 24 నుంచి ఆ లుక్ వచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ.. తాజాగా ఫ్యామిలీ యానిమేటెడ్ టీవీ సిరీస్ నుంచి ఆ వీల్ చైర్ లుక్‌ను జక్కన్న కాపీ కొట్టాడంటూ పిక్స్‌తో సహ తెగ వైరల్ చేస్తున్నారు నేటిజన్స్. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్‌లో జో స్పాన్సన్ క్లిప్టో రోబోట్ సూట్ వేసుకొని మెరుస్తాడు. ఇక ఈ సిరీస్‌లో ఆ వ్యక్తి వెన్నెముక గాయంతో వీల్ చైర్‌కి పరిమితమై ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. సీజన్ 8 ఎపిసోడ్ 14 లో జో స్వాన్సన్ కనిపిస్తాడు. మొత్తానికి ఇప్పుడు సేమ్ అదే లుక్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించడం సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు.. ఈ పిక్స్ వైరల్ గా మారడంతో తెలుగు సినిమా క్యాతిని రెట్టింపు చేస్తున్న రాజమౌళి తన సినిమాల విషయంలో ఏదో ఒక్క చిన్న విషయం దగ్గరైనా ప్రతిసారి ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


