టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు జక్కన్న తీసిన సినిమాలను మించి పోయే రేంజ్‌లో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇప్పటివరకు సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్న జక్కన్న.. నవంబర్ 15 న గ్లోబల్ ఈవెంట్ అనౌన్స్ చేసి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ 15న రివిల్ చేయనున్నాడు.

ఇక ఈ సినిమాను గ్లోబల్ ట్రాటర్ రన్నింగ్ టైటిల్‌తో తెగ వైరల్ చేస్తున్న రాజమౌళి.. రిలీజ్ డేట్‌ను టైటిల్‌ని కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. పాటను స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నాడటంతో హైప్ మరింతగా పెరిగింది. ఆమె వాయిస్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ పాట విని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. శృతిహాసన్ మొదటి సారి తన పూర్తి మ్యూజిక్ టాలెంట్ ను చూపించిందని.. ఓ సంచారి అనే ఈ పాటలో మహేష్ పాత్ర వీరత్వాన్ని ఆయన చేసే జర్నీని ఎంతో అద్భుతంగా వర్ణించిందని.. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ పూనకాలు తెప్పించేలా ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాలాన్నే శాసిస్తూ.. ప్రతిరోజు పరుగులే.. వేగాన్ని శాసిస్తూ.. పెనుగాలే తిరుగులే.. రారా.. వీర, ధ్రువతార, సంచార అంటూ సాంగ్ కొనసాగుతుంది. సాంగ్లో వచ్చే ప్రతి ఒక్క లైన్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుంది. ఈ లిరికల్ వీడియోలో శృతిహాసన్ పాడుతున్న విజువల్స్ కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఇక శృతిహాసన్ పాడుతున్న తీరు.. కీరవాణి సాంగ్ కోసం అందించిన ట్యూన్స్ మరింత హైలెట్ గా నిలిచాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన జక్కన్న.. ఈ మూవీతో హిట్ కొడితే ఈసారి టాలీవుడ్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్ కు పాకి పోతుంది అనడంలో సందేహం లేదు.

